వచ్చే యేడాది సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో సెమీ ఫైనల్‌గా భావించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి తేరుకోలేని గట్టి దెబ్బ తగిలింది. ఆ పార్టీ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయింది. ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. ఈ రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు వ్యతిరేక తీర్పును ఇచ్చారు. ఫలితంగా ఆ పార్టీ అధికారానికి దూరంకానుంది. అదేసమయంలో ఈ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి జీవం పోశాయి. ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానుంది.
ఇప్పటివరకు వస్తున్న ట్రెండ్స్ ప్రకారం ఈ మూడు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో అధికార తెరాస మరోమారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.