Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏ కాంగ్రెస్ వితంతువు అకౌంట్లోకి అంత మొత్తం చేరిందో?: నరేంద్ర మోదీ

Advertiesment
ఏ కాంగ్రెస్ వితంతువు అకౌంట్లోకి అంత మొత్తం చేరిందో?: నరేంద్ర మోదీ
, సోమవారం, 10 డిశెంబరు 2018 (10:29 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతవారంలో రాజస్థాన్‌లో పర్యటనలో భాగంగా.. మోదీ ఓ ప్రచార సభలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అంతేగాకుండా మోదీ వ్యాఖ్యలు కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీని ఉద్దేశించినవని నెట్టించ రచ్చ రచ్చ జరుగుతోంది.


ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ కార్యకర్తలు, నెటిజన్లు మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంకా ప్రధానిపై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ వ్యాఖ్యలను మోదీ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 
 
ఇంతకీ మోదీ చేసిన వ్యాఖ్యల సంగతికి వస్తే.. కాంగ్రెస్ పార్టీ కుంభకోణాలకు పాల్పడిందని.. వితంతు ఫించన్ పథకం అందులో ఒకటని వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా ఏ కాంగ్రెస్ వితంతువు అకౌంట్లోకి ఈ మొత్తం చేరిందోనని కామెంట్ చేశారు. దీనిపై స్పందించిన సీడబ్ల్యూసీ సభ్యుడు సిద్ధరామయ్య.. ప్రధాని దిగజారుడుతనానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనమని ఫైర్ అయ్యారు. 
 
ఇలాంటి మాటలతో ప్రధాని తన పదవికే కళంకం తెచ్చారని.. మహిళలందరీ ఆయన అవమానపరిచేలా వ్యాఖ్యానించారని నిప్పులు చెరిగారు. ప్రధాని మోదీ.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ నుంచి నేర్చుకోవాల్సింది చాలా వుందన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రేవంత్ రెడ్డి రాజకీయ సన్యాసం... ఎందుకు?