Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్ర‌గిరి, కుప్పంలో కూడా ప్ర‌జ‌లు చంద్రబాబును ఛీకొట్టారు: మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు

Webdunia
శనివారం, 20 ఫిబ్రవరి 2021 (19:39 IST)
అవినీతిపరుల్లో చంద్రబాబు తరువాత‌ జలీల్ ఖాన్ ను మించిన వారు లేర‌ని, పుట్టిన చంద్ర‌గిరి, ఉంటున్న కుప్పంలో కూడా ప్ర‌జ‌లు చంద్ర‌బాబును ఛీకొట్టారు అని దేవ‌దాయశాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు అన్నారు. శ‌నివారం నియోజ‌క‌వ‌ర్గ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా 39వ డివిజనులో నాలుగుస్థంభాల రోడ్డు అరవింద స్ట్రీట్ వద్ద నుంచి మంత్రి త‌న ప్ర‌ర్య‌ట‌న ప్రారంభించారు.

డ‌ప్పు‌లు కొట్టి ఎన్నిక‌ల ప్ర‌చారం ప్రారంభించిన మంత్రి స్థానికుల‌ను స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకున్నారు... ప్ర‌జ‌లు జ‌గ‌న‌న్న అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌తో అనందంగా ఉన్నారన్నారు. అనంత‌రం విద్యాధ‌ర పురం అర్టీసీ వ‌ర్క్ షాపు రోడ్డులో ఎస్ కన్వేషన్ హాల్ వేదిక వ‌ద్ద మీడియాతో మాట్లాడారు.

కేశినేని ఏనాడూ నగరంలో పర్యటన చేయలేదన్నారు. ఇపుడు ఎన్నికల గురించి  డ్రామాలు ఆడుతున్నారన్నారు.  ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థులు ఎవరో తేల్చుకోలేని పరిస్థితిలో టీడీపీ ఉందన్నారు. అప్పుడప్పుడు మాత్రమే పవన్ కి రాజకీయం గుర్తు వస్తుందన్నారు.  పవన్ క‌ల్యాణ్‌ పంచాయితీ ఎన్నికల్లో తప్పుడు లెక్కలు  చూపుతున్నార‌న్నారు.

ఏ మీడియాలో కూడా  పంచాయితీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన విజ‌యంపై వార్త‌లు రావ‌డం లేదు ఎందుకు అని ప్ర‌శ్నించారు.. సీఎం జ‌గ‌న్ మెహ‌న్ రెడ్డి  చేతుల మీదుగా  అంతర్వేది నూత‌న రథం అనుకున్న స‌మ‌యం క‌న్నా ముందె 90 రోజుల్లో ర‌థం నిర్మాణం పూర్తి అయింద‌న్నారు.

దీంతో టిడిపి, బీజేపి నాయ‌కులు కావాల‌నే మళ్లీ మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మ‌ట్లాడ‌టం స‌రికాద‌న్నారు. విశాఖ ఉక్కు విషయంలో ఎందుకు బీజేపీ నేతలు ఢిల్లీ వెళ్లారో స‌మాధానం చెప్పాల‌న్నారు. విశాఖ ఉక్కుపై మేం రెచ్చగొడుతున్నామనటం సరికాదన్నారు. అంతర్వేది రథం దహనంలో విష‌యంలో  సీబీఐ ద‌ర్యాప్తుపై బిజేపి ఏమి చేసింది అని ప్ర‌శ్నించారు. 

ప్ర‌ధాని మోడీ పెరు చెప్పుకుని బీజేపీ నేతలు బతికేస్తున్నారన్నారు.  రాష్ట్రంలో ఒక్కరైనా బిజేపి నాయ‌కులు కార్పొరేటర్ గానైనా గెలిచారా అని ప్ర‌శ్నించారు.  ఎమ్మెల్యేగా ఉన్న స‌మ‌యంలో జలీల్ ఖాన్ వక్ఫ్ బోర్డు ద్వారా కోట్లు అవినీతి చేశారన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments