చిలకలూరిపేట పట్ణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి నరసరావుపేట సెంటర్ మీదుగా గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రియాంకరెడ్డి హత్య అత్యంత దారుణమన్నారు. నిందితులకు ప్రజా కోర్టులో శిక్ష విధించాలని కోరారు.
ఈ సందర్భంగా కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. ప్రియాంక రెడ్డి చిత్రపటాలతో ర్యాలీ సాగింది. గాంధీ బొమ్మ వరకు ర్యాలీ చేపట్టారు. కొద్దిసేపు మౌనం పాటించారు. ప్రియాంక రెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పార్టీ నాయకులు, ఏఎంజీ విద్యార్థినులు, పలువురు మహిళలు పాల్గొన్నారు.