క్రియాశీల కార్యకర్తలతో పవన్ సమావేశాలు

Webdunia
శనివారం, 18 జనవరి 2020 (08:33 IST)
నియోజకవర్గాల వారీగా క్రియాశీల కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేయాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఆదేశించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ముఖ్యనేతలతో ఆయన సమావేశమయ్యారు.

రానున్న నెలరోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాల ప్రణాళిక రూపొందించాలని పవన్‌ సూచించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కష్టపడేవారి జాబితాలు తయారు చేయాలని.. ఈనెల చివరి వారం నుంచి కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలన్నారు.

భాజపాతో సుదీర్ఘ రాజకీయ ప్రయాణం, స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన విధివిధానాలపై కార్యకర్తల సమావేశాల్లో చర్చించనున్నారు. గత కొన్నేళ్లుగా పార్టీ జెండా మోస్తున్న కార్యకర్తలను గుర్తించి వారికి జాతీయ, ప్రాంతీయ ప్రాధాన్యత ఉన్న అంశాలు, పార్టీ ఆలోచనా విధానం, వర్తమాన రాజకీయాలు తదితర అంశాలపై శిక్షణ ఇవ్వాలని సూచించారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసిన యువ అభ్యర్థుల సమావేశాలను కూడా ఏర్పాటు చేయాలని పవన్‌ ఆదేశించారు. పార్టీలో ఉంటూ సామాజిక సేవ చేయాలన్న ఆలోచనతో ఉన్నవారితో సేవాదళ్‌ను రూపొందించాలని ఆయన సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments