చంద్రబాబు, పవన్‌ కలిసి కుట్ర: ద్వారంపూడి

మంగళవారం, 14 జనవరి 2020 (19:17 IST)
తమ కార్యకర్తలు, తన ఇంటిపై ప్లాన్‌ ప్రకారమే జనసేన కార్యకర్తలు దాడి చేశారని వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇంటిపై దాడికి యత్నిస్తేనే వైసీపీ కార్యకర్తలు ప్రతిఘటించారని ఆయన తెలిపారు.

పంతం నానాజీ పవన్‌ను తప్పుదోవ పట్టించాడని ఆరోపించారు. ధర్నా ప్రాంతం ఎక్కడ.. తన ఇల్లు ఎక్కడ? అని ద్వారంపూడి ప్రశ్నించారు. ‘‘ధర్నా కోసం వచ్చి దాడులు చేయడం కరెక్టేనా?. చంద్రబాబు మీరు కలిసి ఏదో చేయాలని కుట్ర పన్నారు.

జనసేన నేతలు కాకినాడలో ఉద్రిక్తతలు పెంచుతున్నారు. జగన్‌ను అంటే ఊరుకోం.. చంద్రబాబు, పవన్‌ భాష మార్చుకోవాలి. మీరు ఒక్క మాట అంటే మేం రెండు అంటాం.’’ అని ద్వారంపూడి హెచ్చరించారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం మూడు రాజధానులు ఆచరణ సాధ్యంకాదు: జగన్‌కు సుజనాచౌదరి లేఖ