Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ 'గుండు'... మంత్రి పరిటాల సునీత ఏం చెప్పారో తెలుసా?

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జనంలోకి ఎంట్రీ ఇచ్చుకుని గతంలో జరిగిన అవాస్తవ ప్రచారాలను, పీఆర్పీలో జరిగిన అసలు సంగతులను చెప్పేస్తున్నారు. ముఖ్యంగా ఆయనకు పరిటాల రవి గుండు కొట్టించారంటూ ఆమధ్య జరిగిన ప్రచారంపై ఆయన క్లారిటీ ఇచ్చేశారు. తెదేపాలోని కొందరు నే

Webdunia
సోమవారం, 11 డిశెంబరు 2017 (15:51 IST)
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జనంలోకి ఎంట్రీ ఇచ్చుకుని గతంలో జరిగిన అవాస్తవ ప్రచారాలను, పీఆర్పీలో జరిగిన అసలు సంగతులను చెప్పేస్తున్నారు. ముఖ్యంగా ఆయనకు పరిటాల రవి గుండు కొట్టించారంటూ ఆమధ్య జరిగిన ప్రచారంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. తెదేపాలోని కొందరు నేతలే ఇలాంటి అబద్ధపు ప్రచారం చేశారని కూడా వెల్లడించారు.
 
ఇదిలావుంటే దీనిపై పదేళ్ల క్రితమే పరిటాల రవి మాట్లాడారు. జూబ్లిహిల్స్ ప్రాంతంలో తన స్థలం ప్రక్కనే ఓ స్థలాన్ని కొనుగోలు చేసేందుకు చిరంజీవి ప్రయత్నించారనీ, ఐతే దాన్ని తను వారించినట్లు వెల్లడించారు. ఆ స్థలాన్ని కొంటే, అది తమ ఇంటి పక్కనే వుంటుంది కనుక, అక్కడికి వచ్చే ప్రతి ఒక్కరిని తన మనుషులు తనిఖీలు చేసే అవకాశం వుంటుందనీ, అందువల్ల దాన్ని కొనుగోలు చేయవద్దని తను చెప్పానని వెల్లడించారు. దానితో చిరంజీవి తన ప్రయత్నాన్ని విరమించుకున్నారని వెల్లడించారు. 
 
ఇప్పుడు తాజాగా మంత్రి పరిటాల సునీత కూడా దీనిపై మాట్లాడారు. పవన్ కళ్యాణ్ చెప్పినదే వాస్తవమన్నారు. ఆయనకు పరిటాల రవి గుండు చేయించారన్నది అవాస్తవమనీ, ఎవరో అలా అసత్య ప్రచారం చేశారని అన్నారు. 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేస్తుందన్న నమ్మకంతోనే పార్టీకి మద్దతు ఇచ్చారని ఆమె చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కరాటే కళ్యాణికి నటి హేమ లీగల్ నోటీసులు.. ఎందుకో తెలుసా?

Vijayashanti: అర్జున్ S/O వైజయంతి తర్వాత విజయశాంతి సినిమాలు చేయదా?

Anasuya Bharadwaj: అరి చిత్రానికి కష్టాలు- రిలీజ్‌ ను ఆపుతుంది ఎవరు?

Tamannaah : ముంబైలో తమన్నా భాటియా ఓదెల 2 ట్రైలర్ లాంచ్ కాబోతోంది

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments