ఫేస్ బుక్‌లో పవన్ కళ్యాణ్... రైలులోనే జనసేనాని మాటామంతీ

Webdunia
మంగళవారం, 30 అక్టోబరు 2018 (21:13 IST)
జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఫేస్ బుక్ ద్వారా జనసైనికులు, యువతీయువకులు, ప్రజలకు మరింత చేరువవుతున్నారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో ఫేస్ బుక్‌లో అఫీషియల్ పేజీని ప్రారంభించారు. ఈ పేజీ ద్వారా పార్టీ సిద్దాంతాలు, తన ఆలోచనలను పంచుకుంటారు.
 
పార్టీ కార్యక్రమాలను కూడా తెలియచేస్తారు. ఈ పేజీలో తొలి విషయంగా తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు సంబంధించిన అప్‌డేట్ పోస్ట్ చేశారు. నవంబర్ 2వ తేదీన విజయవాడ నుంచి తుని పట్టణానికి రైలులో చేరుకుంటున్నట్లు వెల్లడించారు. అందులో భాగంగా కొన్ని స్టేషన్లలో వివిధ వర్గాల ప్రతినిధులను కలుసుకుంటానని చెప్పారు.
 
సేనానితో రైలు ప్రయాణం 
జన్మభూమి రైల్లో పవన్ కళ్యాణ్ ప్రయాణిస్తారు. 'సేనానితో రైలు ప్రయాణం' పేరుతో పలు వర్గాల ప్రతినిధులు పవన్ కళ్యాణ్‌తో మాట్లాడతారు. విజయవాడ నుంచి తుని చేరుకొనే వరకూ పలు వర్గాల ప్రజలతో మాటామంతీ ఉంటుంది. మధ్యాహ్నం 1 గం. 20 ని.లకు రైల్వే పోర్టర్లతో మాట్లాడతారు. ఆ తరవాత మామిడి రైతులు, అసంఘటిత రంగంలో ఉన్న చిరు వ్యాపారులు, రైల్వే వెండర్లతోపాటు, రైలులోని ప్రయాణికులు, చెరకు రైతులు, చేనేత కార్మికులు, విద్యార్థులు, ఏటికొప్పాక బొమ్మల తయారీ కళాకారులతో ఈ ప్రయాణంలో మాట్లాడతారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janviswaroop: మహేష్ బాబు మేనకోడలు జాన్విస్వరూప్ నటిగా ఎంట్రీ సిద్ధం

Naveen Chandra: అప్పుడు అరవింద సమేత - ఇప్పుడు మాస్ జాతర : నవీన్ చంద్ర

Suriya: రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ లా వినోదాన్ని పంచగల హీరో రవితేజ: సూర్య

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments