Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ బస్సు యాత్రకు "వారాహి" సిద్ధం... నేడు కొండగట్టులో ప్రత్యేక పూజలు

Webdunia
గురువారం, 8 డిశెంబరు 2022 (09:54 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా తన బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఆయన ఒక ప్రత్యేక వాహనాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు. ఈ వాహనానికి "వారాహి" అనే పేరు పెట్టారు. ఈ వాహనానికి గురువారం తెలంగాణాలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించనున్నారు. 
 
కాగా, తన పర్యటన కోసం సిద్ధమైన 'వారాహి' వాహనాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. దీనికి సంబంధించిన ట్రయల్ రన్ వీడియో, ఫోటోలను పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో పంచుకున్నారు. ఈ బస్సుకు వారాహి అనే పేరు పెట్టినట్టు పవన్ వెల్లడించారు. ఎన్నికల యుద్ధానికి వారాహి సిద్ధమైనట్టు ఆయన ట్వీట్ చేశారు.
 
కాగా, ఈ బస్సు ఆలివ్ రంగులో ఉంది. ఇది చూడటానికి మిలిటరీ వాహనంలా కనిపిస్తుంది. ఎంతో దృఢంగా కనిపిస్తున్న ఈ వాహనంలో పవన్‌కు అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఇందులో హైసెక్యూరిటీ వ్యవస్థతో పాటు జీపీఎస్ ట్రాకింగ్, 360 డిగ్రీల్లో రికార్డు చేయగల సీసీటీవీ కెమెరాలు, అత్యాధునిక సౌండ్ సిస్టమ్, రాత్రివేళల్లో సభల కోసం లైటింగ్ సిస్టమ్‌ ఇలా అన్ని రకాల సదుపాయాలను ఇందులో సమకూర్చుకున్నారు. పైగా, వాహనం ట్రయల్‌ను కూడా ఆయన స్వయంగా పర్యవేక్షించారు. ఈ వారాహికి గురువారం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments