పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చైతన్య రథం వరాహికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తన రాబోయే ఎన్నికల ప్రచారం కోసం ఈ వాహనాన్ని వాడబోతున్నారు. గతంలో ఎన్టీఆర్ వాడిన చైతన్య రథం తరహాలోనే పవన్ కళ్యాణ్ ఉపయోగించనున్నారు.
పవన్ కళ్యాణ్ తన యాత్ర, ప్రచారం కోసం ఏపీలో పర్యటించనున్నారు. ఇందుకోసం చైతన్య రథం సిద్ధమైంది. ఈ వాహనానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ వాహనంలో అన్ని సౌకర్యాలు వుంటాయి. సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ, వాహనంలో ఆరుగురు వ్యక్తులు ఒకరికొకరు సులభంగా కమ్యూనికేట్ చేసుకోవచ్చు.
జనసేన పార్టీ (జేఎస్పీ) రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, నాదెండ్ల మనోహర్ గతంలో ఎన్నికలకు ముందు పార్టీ అధినేత ప్రతి జిల్లాలో పర్యటిస్తారని ప్రకటించిన సంగతి తెలిసిందే.