ఐదు గంటల పాటు కాలినడక.. దీక్షను విరమించనున్న పవన్ కల్యాణ్

సెల్వి
బుధవారం, 2 అక్టోబరు 2024 (08:50 IST)
Pawan Kalyan
ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 5గంటల కాలినడక తర్వాత కొండపైకి చేరుకున్నారు.  రాత్రికి అక్కడే బస చేశారు. డిప్యూటీ సీఎం బసకు, దర్శనానికి సంబంధించిన ఏర్పాట్లను స్థానిక నేతలు, టీటీడీ అధికారులు ఏర్పాటు చేశారు. 
 
పవన్ కల్యాణ్ మరికాసేపట్లో బస చేసిన అతిథి గృహం నుంచి శ్రీవారి దర్శనం చేసుకుంటారు. ఇందుకు టీటీడీ అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. అనంతరం దీక్ష విరమిస్తారు.
 
బుధవారం ఉదయం 10 గంటలకు శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ప్రాయశ్చిత్త దీక్ష విరమిస్తారు. ఆయన వెంట అధికారులు, వ్యక్తిగత భద్రత సిబ్బంది సైతం మెట్ల మార్గంలో తిరుమల కొండకు చేరుకున్నారు. 
 
పవన్ కల్యాణ్ తిరుమల శ్రీవారి దర్శనం కోసం కాలినడక మార్గంలో కొండపైకి చేరుకున్న సమయంలో ఆయన స్నేహితుడు, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి సైతం ఆయన వెంట ఉన్నారు. 
 
ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించిన సమయంలో పవన్ వెంట ఉన్న ఆయన దీక్ష విరమించే సమయంలో కూడా పక్కనే ఉండటం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముచ్చటగా మూడోసారి విడాకులు ఇచ్చేశాను.. హ్యాపీగా వున్నాను: మీరా వాసుదేవన్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments