చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ - సంఘీభావం తెలిపిన జనసేనాని

Webdunia
ఆదివారం, 8 జనవరి 2023 (12:39 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాసానికి సినీ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం ఉదయం వెళ్లారు. హైదరాబాద్ నగరంలో వీరిద్దరి భేటీ జరిగింది. తన నివాసానికి వచ్చిన పవన్‌కు చంద్రబాబు ఇంటి గుమ్మం వద్దకు ఎదురెళ్ళి స్వాగతం పలికారు. వీరిద్దరూ ఏపీలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు రాజకీయ నిపుణులు చెబుతున్నారు. 
 
ముఖ్యంగా, ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పం పర్యటన సందర్భంగా వైకాపా ప్రభుత్వం తెచ్చిన నల్ల జీవో నంబర్ 1ని సాకుగా చూపి చిత్తూరు జిల్లా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. చంద్రబాబు పర్యటనను అడుగడుగునా అడ్డుకున్నారు. దీంతో చంద్రబాబును పవన్ కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు కుప్పంలో పోలీసులు సృష్టించిన అరాచకాలపై చర్చించే అవకాశం ఉంది. అలాగే, ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక బలోపేతానికి ఐక్య కార్యాచరణ రూపొందించే అంశంపై వీర్దదరూ చర్చించనున్నట్టు తెలుస్తోంది. 
 
కొన్ని నెలల క్రితం విజయవాడలోని ఓ హోటల్‌లో సమావేశమైన వీరిద్దరు ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు, నిర్ణయాలపై ఐక్యంగా పోరాటం చేయాలని ఇప్పటికే వీరిద్దరూ నిర్ణయించిన విషయంతెల్సిందే. ఇపుడు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1పై తాజా భేటీలో చర్చించనున్నట్టు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

ఘంటసాల స్క్రిప్ట్ ఎంతో ఎమోషనల్‌గా ఉంటుంది : ఆదిత్య హాసన్

సంగీత్ శోభన్ హీరోగా పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో సినిమా ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments