Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ నగరంలో చంద్రబాబును కలిసిన పవన్ కళ్యాణ్

Webdunia
బుధవారం, 6 డిశెంబరు 2023 (15:24 IST)
హైదరాబాద్ నగరంలో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం కలిశారు. చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్.. పలు అంశాలపై వారిద్దరూ చర్చించారు. ముఖ్యంగా, ఉమ్మడి మేనిఫెస్టో అంశంపై ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. 
 
ఏపీలో వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఉమ్మడి మేనిఫెస్టోను రూపొందించనున్నారు. ఇప్పటికే రెండు పార్టీలకు చెందిన సమన్వయ కమిటీలు, ఉమ్మడి మేనిఫెస్టో కమిటీలను ఏర్పాటు చేశారు. సీట్ల పంపకాలు, ఏయే స్థానాల్లో పోటీ చేయాలనే అంశంపై కూడా స్వల్ప చర్చ జరిగినట్టు సమాచారం. 
 
మరోవైపు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సైతం ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోనే ఉన్నారు. అయితే, ఆయన చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల మధ్య జరిగిన సమావేశంలో పాల్గొన్నారా లేదా అన్నది తెలియాల్సివుంది. 
 
ఇదిలావుంటే, ఈ నెల 7వ తేదీన చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏపీలో ఓట్ల అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన ఫిర్యాుద చేయనున్నారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 10వ తేదీన భారత ఎన్నికల సంఘానికి చెందిన ప్రత్యేక బృందం ఏపీకి రానుంది. 
 
ఈ నేపథ్యంలో వారు రాష్ట్రానికి రాకముందే సీఈసీని కలిసి ఓట్ల అక్రమాలపై ఫిర్యాదు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. చంద్రబాబు పార్టీతో కీలక నేతలు కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో పార్టీ ఎంపీలు ఢిల్లీలోనే ఉన్నారు. వీరందరితీ కలిసి చంద్రబాబు సీఈసీని కలవనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments