Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మా... మీ ముఖంలో మళ్లీ నవ్వు కనిపించేలా మేమంతా కలిసి పని చేస్తాం : పవన్ కళ్యాణ్

Webdunia
శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (11:36 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఓ హామీ ఇచ్చారు. అమ్మా... మీరు ఎలా ఉన్నారు.. మీ ముఖంలో మళ్లీ నవ్వు కనిపించేలా మేమంతా కలిసి పనిచేస్తాం అని హామీ ఇచ్చారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్ గురువారం కలుసుకున్నారు. ఆ తర్వాత ఆయన జైలు వెలుపల మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత రాజమండ్రి జైలుకు సమీపంలోనే బస చేస్తున్న చంద్రబాబు కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లి వారిని ఆప్యాయంగా పలుకరించి పరామర్శించారు. 
 
ఈ సందర్భంగా నారా భువనేశ్వరితో మాట్లాడుతూ, రాజకీయాలకు దూరంగా ఉండే మీపైనా వైకాపా ఎమ్మెల్యేలు, నాయకులు వ్యాఖ్యలు చేయడం, దూషణలకు దిగడం ఎంతో ఆవేదన కలిగించిందన్నారు. శాసనసభ సాక్షిగా మిమ్మల్ని అవమానిస్తే చాలా బాధపడ్డానని చెప్పారు. రాష్ట్రంలో మరే మహిళా ఇలాంటి ఇబ్బంది పడకుండా చూడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 
 
"అమ్మా.. మీ ముఖంలో మళ్లీ నవ్వు కనిపించేలా మేమంతా కలిసి పని చేస్తా"మని భువనేశ్వరికి జనసేనాని భరోసా ఇచ్చారు. చంద్రబాబు కుశలమేనని, ఆందోళన చెందవద్దని ఆమెకు ధైర్యం చెప్పారు. ప్రజలు మన పక్షానే ఉన్నారని, న్యాయమే గెలుస్తుందని ఆయన అన్నట్లు సమాచారం. క్లిష్ట సమయంలో మద్దతుగా నిలిచిన పవన్ కల్యాణ్‌కు భువనేశ్వరి ధన్యవాదాలు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sonu Sood : సోనూ సూద్ భార్యకు తృటిలో తప్పిన ప్రమాదం

Vijay: దళపతి విజయ్ భారీ చిత్రం జన నాయగన్ వచ్చే సంక్రాంతికి విడుదల

ప్రభాస్‌తో కలిసి నటించడాన్ని అదృష్టంగా భావిస్తున్నా : మాళవిక మోహనన్

Naveen Chandra: డాక్టర్స్ ప్రేమ కథ గా 28°C, చాలా థ్రిల్లింగ్ అంశాలున్నాయి : నవీన్ చంద్ర

Samantha: సమంత రూత్ ప్రభు రహస్యంగా నిశ్చితార్థం చేసుకుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

తర్వాతి కథనం
Show comments