Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏ తండ్రికీ ఇలాంటి పరిస్థితి రాకూడదు... పవన్ కళ్యాణ్ కన్నీరు

రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ మృతి చెందడంపై జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఏ తండ్రికి ఇలాంటి పరిస్థితి రాకూడదని అన్నారు. హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి వెళ్లి నిషిత్ మృతదేహాన్ని

Webdunia
బుధవారం, 10 మే 2017 (14:30 IST)
రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ మృతి చెందడంపై జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఏ తండ్రికి ఇలాంటి పరిస్థితి రాకూడదని అన్నారు. హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి వెళ్లి నిషిత్ మృతదేహాన్ని సందర్శించి కళ్లనీళ్లు పెట్టుకున్నారు. నిషిత్ మృతదేహం వద్ద రోదిస్తున్న నారాయణ కుటుంబ సభ్యులను పవన్ కల్యాణ్ ఓదార్చారు.
 
అనంతరం పవన్ మాట్లాడుతూ... ఎంతో భవిష్యత్ ఉన్న యువకుడు నిషిత్ ఇలా అర్థంతరంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తనను కలచివేసిందన్నారు. చెట్టంత కుమారుడు కళ్లెదుటే కనుమరుగయ్యే పరిస్థితి ఏ తండ్రికీ రాకూడదని ఆయన అన్నారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు అంతా కలిసికట్టుగా ప్రయత్నం చేయాల్సి వుందన్నారు. నిషిత్, అతడి స్నేహితుడు వర్మ కుటుంబ సభ్యులకు తమ జనసేన పార్టీ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: పుష్ప -2 ‌పై పూనమ్ కౌర్ ప్రశంసలు.. జాతర సీన్ అదిరింది.. స్పందించేదేలే!

సంధ్య థియేటర్‌ నుంచి బయటికి అల్లు అర్జున్‌.. సీసీ టీవీ దృశ్యాలు వైరల్‌ (video)

అల్లు అర్జున్ సినిమాల్లో మాదిరి నిజ జీవితంలో నటిస్తున్నట్లు కనిపిస్తోంది.. చామల

పుష్ప-2: స్మగ్లింగ్‌ను కీర్తిస్తున్న సినిమాకు సబ్సిడీలా.. సీపీఐ నారాయణ

అల్లు అర్జున్ థియేటర్‌ బయట రోడ్‌షోలో పాల్గొన్నాడా లేదా..? వీడియోలున్నాయ్‌గా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments