Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రంప్ దూకుడుకు నో బ్రేక్.. ఎఫ్‌బీఐ డైరక్టర్ కామీపై వేటు.. హిల్లరీ కేసు నమోదు చేయకపోవడం వల్లే?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడును పెంచారు. అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) డైరక్టర్ జేమ్స్ కామీపైనే వేటేశారు. దీనిపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయినప్పటికీ ట్రంప్

Webdunia
బుధవారం, 10 మే 2017 (14:29 IST)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడును పెంచారు. అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) డైరక్టర్ జేమ్స్ కామీపైనే వేటేశారు. దీనిపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయినప్పటికీ ట్రంప్ తన పని తాను చేసుకోబోతున్నారు. ఇంకా కామీపై వేటు వేయడంపై ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని వైట్‌హౌస్ కూడా తేల్చేసింది. 
 
కాగా కామీపై ట్రంప్ వేటు వేసేందుకు అసలు కారణం.. ఒబామా సర్కారులో విదేశాంగ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన హిల్లరీ క్లింటనేనని తెలుస్తోంది. విదేశాంగ మంత్రిగా ఉన్న సమయంలో హిల్లరీ ప్రైవేట్ ఈ-మెయిల్ సర్వర్‌ను వాడటంపై ఎఫ్‌బీఐ విచారణ జరుపుతోంది. ఈ స్కామ్‌లో హిల్లరీపై కేసు నమోదు చేయకపోవడాన్ని ట్రంప్ తప్పుబట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఏకంగా కామీని పదని నుంచి తొలగించి.. ఎఫ్‌బీఐ మెడలు వంచే ప్రయత్నం చేస్తున్నారు. 
 
ఇందులో భాగంగా కామీని తొల‌గించి చాలా పెద్ద త‌ప్పు చేస్తున్నార‌ని తాను ట్రంప్‌తో అన్న‌ట్లు సెనేట్ డెమొక్ర‌టిక్ నేత చ‌క్ షూమెర్ వెల్ల‌డించారు. అయితే దీనికి ట్రంప్ స‌మాధానం ఇవ్వలేదన్నారు. అలాగే సెనేట్ ఇంటెలిజెన్స్ కమిటీ రిపబ్లిక్ ఛైర్మన్, సెనేటర్ రిచర్డ్ బర్ కూడా ట్రంప్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. కామీని తొల‌గించ‌డం ఎఫ్‌బీఐకే కాదు దేశానికే న‌ష్ట‌మ‌ని వ్యాఖ్యానించారు. అయితే ట్రంప్ మాత్రం ఎఫ్‌బీఐపై ప్రజల్లో సడలిన నమ్మకాన్ని పునరుద్ధరించాలనే ఉద్దేశంతోనే కామీని తొలగించినట్లు వైట్ హౌస్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments