Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటి పేరు మార్చుకున్న పవన్ కళ్యాణ్

Webdunia
శుక్రవారం, 16 నవంబరు 2018 (15:45 IST)
జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ తన ఇంటి పేరును మార్చుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి సోదరుడుగా సినీరంగ ప్రవేశం చేసిన కొణిదెల పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకుని టాలీవుడ్‌లో అగ్రహీరోగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఇందుకోసం జనసేన పార్టీతో ఓ పార్టీని స్థాపించారు. ప్రస్తుతం ప్రజాపోరాట యాత్ర పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. 
 
ఈయన తాజాగా తన ఇంటి పేరును మార్చుకున్నారు. ఇకపై తన ఇంటిపేరు 'కొణిదెల' కాదని 'తెలుగు' అని ప్రకటించారు. తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన ఆ పార్టీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, తనను ఓ కులానికో.. కుటుంబానికో పరిమితం చేయడం సరికాదని అన్నారు. తాను తెలుగు జాతికి సంబంధించిన వ్యక్తినని పేర్కొన్నారు.
 
ఇక అడ్డదారిలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడులా తాను మాటలు మార్చబోనని ప్రకటించారు. కృష్ణాగోదావరి (కేజీ బేసిన్) బేసిన్‌లో అపారమైన గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయని అందువల్ల తాను ప్రతి ఇంటికి గ్యాస్ ఉచితంగా సరఫరా చేస్తానని ప్రకటించానని తెలిపారు. అలాగే, తమ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైతే దివ్యాంగులు పింఛన్ కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన పనిలేదని, అధికారులే వారివద్దకు వచ్చి పింఛన్ మంజూరు చేస్తారని తెలిపారు. అయితే, ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఓటును అమ్ముకోకుండా బాధ్యతగల నేతలను ఎన్నుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

మరీ స్లిమ్‌గా సమంత, రూ. 500 కోట్ల ప్రాజెక్టు కోసమే అలా...

పవన్ కళ్యాణ్ చిత్రం పురుష టైటిల్ పోస్టర్‌ రిలీజ్ చేసిన గౌతమ్ తిన్ననూరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments