ఇప్పటం బాధిత కుటుంబాలకు రూ.లక్ష చొప్పున సాయం : పవన్ కళ్యాణ్

Webdunia
మంగళవారం, 8 నవంబరు 2022 (13:50 IST)
ఇప్పటం గ్రామానికి చెందిన బాధితులకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. వైకాపా నేతల ప్రోద్భలంతో ఇప్పటం గ్రామంలోని జనసేన పార్టీ మద్దతుదారుల ఇళ్లను అధికారులు కూల్చివేశారు. దీంతో ఆ గ్రామాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్ బాధితులకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. బాధిత కుటుంబాలకు చెందిన వారికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్టు ప్రకటించారు. ఈ మొత్తాన్ని త్వరలోనే అందజేస్తామని ఆయన మంగళవారం ప్రకటించారు. ఈ విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. 
 
గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పనులు వివాదాస్పదంగా మారిన విషయం తెల్సిందే. విస్తరణ పేరుతో జనసేన పార్టీకి చెందిన మద్దతుదారుల గృహాలను కూల్చివేశారు. దీనిపై ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. జనసేన పార్టీ ఆవిర్భావ సభకు సహకరించారన్న కక్షతో వైకాపా నేతలు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఈ గృహాలను కూల్చివేశారు. ఇది రాష్ట్రంలో సంచనంగా మారిన విషయం తెల్సిందే. 
 
దీనిపై నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, ఇప్పటం గ్రామంలో వైకాపా ప్రభుత్వ దాష్టీకానికి ఇళ్లు దెబ్బతిన్నవారిని జనసేన పార్టీ ఆదుకుటుందని తెలిపారు. బాధితులకు తన వంతుగా అండగా నిలబడాలని పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ నిర్ణయించారని తెలిపారు. ఇందులోభాగంగా, బాధితులకు పవన్ కళ్యాణ్ లక్ష రూపాయల సాయం ప్రకటించారు. ఈ మొత్తాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా బాధితులకు త్వరలోనే అందజేస్తారని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments