Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్-జగన్ మీ ఇద్దరూ రండి... ప్రత్యేక హోదా తెద్దాం... కాంగ్రెస్ పిలుపు

ప్రత్యేక హోదా ఇవ్వమంటే పాచిపోయిన లడ్డూల్లాంటి ప్యాకేజీ ఇచ్చింది కేంద్రం అని రుసరుసలాడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ప్రత్యేక హోదాతోనే ఏపీ అభివృద్ధి సాధ్యం అని చెపుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిలను కాంగ్రెస్ పార్టీ ఆహ్వాన

Webdunia
గురువారం, 1 జూన్ 2017 (15:51 IST)
ప్రత్యేక హోదా ఇవ్వమంటే పాచిపోయిన లడ్డూల్లాంటి ప్యాకేజీ ఇచ్చింది కేంద్రం అని రుసరుసలాడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ప్రత్యేక హోదాతోనే ఏపీ అభివృద్ధి సాధ్యం అని చెపుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిలను కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తోంది. పార్టీలో చేరమని కాదు... ప్రత్యేక హోదా సాధించేందుకు వారిద్దరినీ తాము జూన్ 4న గుంటూరులో నిర్వహించనున్న ప్రత్యేక హోదా భరోసా సభలో పాల్గొనాలని. ప్రత్యేక హోదా కోసం అంతా కలిసి పోరాడుదామని కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తోంది. 
 
అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన భాజపా, పీఠమెక్కగానే ప్రత్యేక హోదాను తుంగలో తొక్కిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. లక్ష్య సాధన కోసం విపక్ష పార్టీలన్నిటినీ ఆహ్వానించామనీ, జనసేన, వైకాపాలకు కూడా ఆహ్వానాలు ఇచ్చామని తెలిపింది. సభకు వారు వస్తారని ధీమా కూడా వ్యక్తం చేస్తోంది.
 
ఐతే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా అంశాన్ని అసలు బిల్లులో పెట్టకుండా ఏపీకి అన్యాయం చేసిందని భాజపా వాదిస్తోంది. చట్టబద్ధత లేని హామీలు ఇచ్చి వాటి కోసం పోరాడుతున్నట్లు కాంగ్రెస్ నటించడం విచిత్రంగా వుందని భాజపా అధ్యక్షులు అమిత్ షా మొన్న విజయవాడ సభలో వెల్లడించారు. తాము ప్రత్యేక హోదాను మించి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని ఆయన చెప్పుకొచ్చారు.

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments