వృద్ధులకు ముద్దులు పెడితే సరిపోతుందా..?: జనసేనాని సెటైర్లు

రాష్ట్ర ప్రభుత్వం వృద్ధుల కోసం వృద్ధాశ్రమాలు ఎందుకు కట్టించడం లేదని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. తాను సీఎంను అయితే వృద్ధుల సంక్షేమం కోసం ఏం చేయాలో అన్నీ చేస్తానని చెప్పారు. ఓ వృద్ధురాలు తనపై చూపించి

Webdunia
శుక్రవారం, 28 సెప్టెంబరు 2018 (11:07 IST)
రాష్ట్ర ప్రభుత్వం వృద్ధుల కోసం వృద్ధాశ్రమాలు ఎందుకు కట్టించడం లేదని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. తాను సీఎంను అయితే వృద్ధుల సంక్షేమం కోసం ఏం చేయాలో అన్నీ చేస్తానని చెప్పారు. ఓ వృద్ధురాలు తనపై చూపించిన ఆప్యాయతకు తానెంతో భావోద్వేగానికి గురయ్యానని.. కళ్లు చెమ్మగిల్లాయని పవన్ తెలిపారు. పిల్లల్ని కని పెంచి.. చదివి ప్రయోజకులను చేసిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో వదిలిపెట్టడం సరికాదన్నారు. 
 
అంతేగాకుండా వృద్ధులకు వైకాపా చీఫ్ జగన్ ముద్దులు పెట్టడంపై జనసేనాని సెటైర్లు వేశారు. వృద్ధులకు ముద్దులు పెట్టితే సరిపోదని.. అలా చేస్తే వారి బాధలు తీరిపోవని జగన్‌ను ఉద్దేశించి.. పవన్ ఎద్దేవా చేశారు. అలాగే రాష్ట్రంలో శాంతి భద్రతలను గాడిలో పెట్టడంలో డీజీపీ వైఫల్యం చెందారని...అందుకే ఇలాంటి కిరాయి హంతకులు రెచ్చిపోతున్నారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. 
 
ఇకపోతే.. తనకు ప్రాణహాని ఉందంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. తనపై కుట్రలు చేస్తున్న వారు అధికారపక్షమో, ప్రతిపక్షమో తెలీదన్నారు. ఇదే సమయంలో తనపై కుట్రలు చేస్తున్న వారెవరో తెలుసంటూ పవన్ వ్యాఖ్యానించడం కొత్త చర్చలకు తెరలేపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments