Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఓడిపోతే పోయేది నేనొక్కడినే.. గెలిస్తే అందరికీ ఉపయోగపడతా... పవన్ కల్యాణ్

జనసేన పార్టీ ప్రారభించినపుడు జగన్ మోహన్ రెడ్డిలా వేల కోట్లు లేవు, లోకేష్‌లా హెరిటేజ్ కంపెనీ లేదు. ఏదో చిన్నపాటి జీవితం. తెలిసిందల్లా సాటి మనిషి కష్టాల్లో ఉంటే ఆదుకోవడం ఒక్కటేనని ఏలూరు పాతబస్టాండ్‌ సెంటర్‌లో జరిగిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానిం

ఓడిపోతే  పోయేది నేనొక్కడినే.. గెలిస్తే అందరికీ ఉపయోగపడతా... పవన్ కల్యాణ్
, శుక్రవారం, 28 సెప్టెంబరు 2018 (09:58 IST)
జనసేన పార్టీ ప్రారభించినపుడు జగన్ మోహన్ రెడ్డిలా వేల కోట్లు లేవు, లోకేష్‌లా హెరిటేజ్ కంపెనీ లేదు. ఏదో చిన్నపాటి జీవితం. తెలిసిందల్లా సాటి మనిషి కష్టాల్లో ఉంటే ఆదుకోవడం ఒక్కటేనని ఏలూరు పాతబస్టాండ్‌ సెంటర్‌లో జరిగిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. సభలో పాల్గొన్న యువత సి.ఎం.. సి.ఎం అంటూ నినాదాలు చేయడంతో అసలు నేను ముఖ్యమంత్రే అవుతానని ఎందుకనుకుంటున్నారు. 
 
అంత కంటే ఎక్కువే అవుతానేమో.. కానీ పవన్ కళ్యాణ్‌కు ముఖ్యమంత్రి పదవిపై ఆశలేదు. నాకు కావాల్సింది శాంతిభద్రతల పరిరక్షణే ఒక్కటే  అన్నారు. ఏలూరు చరిత్రలో ఎప్పుడు పది హత్యలు జరిగిన దాఖలాలు లేవు. గత నాలుగేళ్ళలో ఈ చుట్టుపక్కల 10 హత్యలు జరిగాయి. మీ ఎమ్మెల్యేలకి పేకాట క్లబ్బుల మీద ఉన్న ఆశక్తి అభివృద్దిపై లేదు. వారి దృష్టంతా కబ్జాలు, పేకాటక్లబ్బులపైనే. 
 
నా చిన్నతనం నుంచి రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నా. ఖుషీ సినిమాలో రౌడీలను ప్రశ్నించే పాట పెట్టింది అందుకే. రౌడీలను పక్కనబెట్టుకుని మీరు ఎలా ముఖ్యమంత్రి అవుదామనుకుంటున్నారు లోకేష్ గారు అని ప్రశ్నించారు. ఏడాదికి వంద కోట్లు సంపాదించే స్థాయిలో ఉన్నా నాకు అవేమి సంతృప్తి ఇవ్వలేదు. కానీ నాలాంటి వాడు రాజకీయాల్లోకి వస్తే ఓడితే పోయేది ఒక్కడినే. గెలిస్తే మాత్రం మీ అందరికి ఉపయోగం అని పవన్ కళ్యాణ్ అనడంతో సభ చప్పట్లతో హోరెత్తిపోయింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తాగుబోతు భర్త పోరుపడలేక కుమార్తెతో కలిసి....