అలనాటి రచనల డిజిటలైజేషన్‌కు పవన్ సాయం

Webdunia
సోమవారం, 16 మార్చి 2020 (08:40 IST)
రాజమహేంద్రవరంలో పేరుగాంచిన గౌతమీ గ్రంథాలయాన్ని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సందర్శించారు. ఈ సంద‌ర్భంగా గ్రంథాలయంలో ఉన్న పుస్తకాల వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.

గ్రంథాలయ కార్యాలయంలో ఘనాపాటి, పండితులు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి, నారాయణరావు, రంగనాథ్ తదితరులతో ముచ్చటించారు. గ్రంథాలయంలో ఉన్న తాళపత్ర గ్రంథాలను, రాగి రేకుల మీద వేసిన శాసనాలను, 1771 కాలంలో ప్రచురితమైన పుస్తకాలు, సంస్కృత బైబిల్‌ను పవన్ ఆసక్తిగా తిలకించారు.

తాళపత్రాలు రచించే ఘంటాన్ని పరిశీలించారు. ఘంటంతో లిఖించే విధానాన్ని అక్కడ పండితులను అడిగి తెలుసుకున్నారు. శిష్టా ఆంజనేయశాస్త్రి పుస్తకాల‌పై వాకబు చేశారు. మాటల సందర్భంలో గ్రంథాలయ డిజిటలైజేషన్ ప్రక్రియ గురించి నిర్వాహకులు వివరించారు.

చారిత్రక పుస్తకాలను భవిష్యత్ తరాలకు అందించే ఈ ప్రక్రియ తమకు శక్తికి మించిన భారంగా మారిందని తెలిపారు. డిజిటలైజేషన్ వివరాలు తెలుసుకున్న పవన్ అందుకు అయ్యే మొత్తం తాను భరిస్తానని మాటిచ్చారు.

ఈ సందర్భంగా విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి శాలువా కప్పి పవన్‌ను  సత్కరించారు. కార్య‌క్ర‌మంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, పీఏసీ సభ్యుడు కందుల దుర్గేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments