Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా నిర్మూలనకు జగన్ సర్కారు కట్టుబడిలేదు : పవన్ కళ్యాణ్

Webdunia
సోమవారం, 4 మే 2020 (18:10 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను అంతమొందించేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా సర్కారు చిత్తశుద్ధితో పని చేయడం లేదని ఆయన ఆరోపించారు. 
 
ఆయన సోమవారం అనంతపురం జిల్లాలోని జనసేన పార్టీ నేతలో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా రైతులు, ఆ జిల్లాలోని చిక్కుకునిపోయిన వలస కూలీలు, కార్మికుల బాగోగులపై పవన్ ఆరా తీశారు. 
 
ఆ తర్వాత ఆయన పార్టీ నేతలతో మాట్లాడుతూ, కరోనా వైరస్ నిర్మూలన కోసం జగన్ సర్కారు ఏమాత్రం చిత్తశుద్ధితో పని చేయడం లేదని చెప్పుకొచ్చారు. ఇతర అంశాలపై ఉన్న శ్రద్ధ కరోనా వైరస్ నిర్మూలనపై జగన్ సర్కారు చూపించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. 
 
అంతేకాకుండా, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులను నిలదీయాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు. ఇదే పరిస్థితి కొనసాగినట్టయితే, ఈ వైరస్‌ను నిర్మూలించడం అంత సాధ్యంకాకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా, గ్రీన్, ఆరెంజ్ జోన్లకు చెందిన వారిని రెడ్ జోన్లలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

చంద్రబోస్ రాసిన ఒప్పుకుందిరో పాటను కోర చిత్రంలో చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments