ఆ అమ్మాయికి మా ఇంటి నుంచి తాళి, చీర పంపాం: పరిటాల శ్రీరామ్

అనంత‌పురం జిల్లాలో ఎక్క‌డ ఏ హ‌త్య జ‌రిగినా, కిడ్నాప్ జ‌రిగినా త‌న‌తో ముడిపెట్ట‌డం భావ్యం కాద‌న్నారు మంత్రి ప‌రిటాల సునీత కుమారుడు ప‌రిటాల శ్రీరామ్. కేఎన్ పాల్యలో అమ్మాయి హత్య, కందుకూరులో జరిగిన హత్య, ధర్మవరంలో జరిగిన కిడ్నాప్‌ తదితర ఘటనల వెనుక తన హస్

Webdunia
శనివారం, 16 జూన్ 2018 (14:22 IST)
అనంత‌పురం జిల్లాలో ఎక్క‌డ ఏ హ‌త్య జ‌రిగినా, కిడ్నాప్ జ‌రిగినా త‌న‌తో ముడిపెట్ట‌డం భావ్యం కాద‌న్నారు మంత్రి ప‌రిటాల సునీత కుమారుడు ప‌రిటాల శ్రీరామ్. కేఎన్ పాల్యలో అమ్మాయి హత్య, కందుకూరులో జరిగిన హత్య, ధర్మవరంలో జరిగిన కిడ్నాప్‌ తదితర ఘటనల వెనుక తన హస్తం లేదని ఆయన తెలిపారు. కేఎన్ పాల్యలో చనిపోయిన అమ్మాయి పెళ్లికి మా ఇంటి నుంచే తాళిబొట్టు, చీర పంపామని శ్రీరామ్ చెప్పారు. 
 
అంతే కాకుండా... మా చిన్నాన్న చనిపోతే దాని గురించి వివరణ ఇవ్వాల్సి రావడం బాధాకరం. పరస్పర అభివృద్ధి కోసం అందరం కలిసి పాటుపడ్డాం. ఐదు రోజులపాటు ఎంతో కష్టపడి ఆయన మా చెల్లి పెళ్లి చేశారు. చమన్ మా ఇంట్లో వ్యక్తి. నాన్నకు కూడా ఎంతో ముఖ్యమైన వ్యక్తి. రాజకీయాల కోసం ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేసి మా మనసుల్ని గాయపరుస్తున్నారని శ్రీరామ్ ఆవేద‌న వ్య‌క్తం చేసారు. 
 
నాగూర్ హుస్సేన్ అనే మాజీ మావోయిస్టుతో కలిసి పదిమంది హత్యకు కుట్ర పన్నారని విజయసాయి రెడ్డి చేసిన విమర్శలపై పరిటాల శ్రీరామ్ మండిపడ్డారు. నాలుగేళ్లుగా లేనిది ఎన్నికలు దగ్గరపడుతున్నవేళ.. పరిటాల కుటుంబంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. మేం భూ దందాలు చేయడం లేదన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swamy: రామ్ చరణ్- ఉపాసనల ట్విన్ బేబీస్.. వేణు స్వామి జ్యోతిష్యం తప్పిందిగా?

Upasana: రామ్ చరణ్, ఉపాసనకు ట్విన్ బేబీస్ రానున్నారా? (video)

Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Chiranjeevi.: సూపర్ స్టార్ చిరంజీవి.. విశ్వంభర.. ఎప్పుడొస్తుందో తెలుసా..

Chandini Chowdhury : యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చాందినీ చౌదరి... సంతాన ప్రాప్తిరస్తు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments