వైకాపా శ్యామలతో సహా 11 మంది సెలెబ్రిటీలపై కేసు నమోదు!!

ఠాగూర్
మంగళవారం, 18 మార్చి 2025 (09:42 IST)
వైకాపా అధికార ప్రతినిధి శ్యామలతో సహా 11 టీవీ, సినీ సెలెబ్రిటీలపై హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరికి త్వరలోనే నోటీసులు ఇచ్చి అరెస్టులు చేసే అవకాశం ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. కలర్ ప్రిడక్షన్, నంబర్ ప్రిడక్షన్, క్రికెట్ ఇలా చైనా కేంద్రంగా పనిచేస్తున్న పలు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినందుకు, చేస్తున్నందుకు వీరిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 
 
పోలీసులు కేసు నమోదు చేసిన వారిలో బుల్లితెర యాంకర్, వైకాపా అధికార మహిళా ప్రతినిధి శ్యామల, టీవీ, సినీ సెలెబ్రిటీలు హర్షసాయి, విష్ణుప్రియ, ఇమ్రాన్ ఖాన్, రీతూ చౌదరి, బండారు శేషయాని, సుప్రీత, కిరణ్ గౌడ్, అజయ్, సన్నీ యాదవ్, సుధీర్‌లు ఉన్నారు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. మియాపూర్‌కు చెందిన వి.వినయ్ అమీర్‌పేటలోని ఓ సంస్థలో శిక్షణ తరగతులకు హాజరవుతున్నాడు. తనతో పాటు శిక్షణ పొందుతున్న పలువురు విద్యార్థులు బెట్టింగ్ యాప్‌లకు బానిసలై భారీగా డబ్బు నష్టపోయినట్టు గుర్తించారు. దీంతో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తూ విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారంటూ పలువురు యూట్యూబర్లపై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 
అతడి ఫిర్యాదుతో సోమవారం 11 మంది యూట్యూబర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లపై గేమింగ్ చట్టంలోని సెక్షన్లు 3, 3ఏ, 4తో పాటు చట్టంలోని సెక్షన్ 66డి, బీఎన్ఎస్‌లోని సెక్షన్ 318 (4)ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేశారు. వీరందరికీ త్వరలోనే నోటీసులు జారీ చేసి విచారించనున్నారు. ఆ తర్వాత వారి వాంగ్మూలాన్ని బట్టి అరెస్టు చేసే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Renu Desai: రేబిస్‌ టీకా వేయించుకున్న రేణు దేశాయ్.. వీడియో వైరల్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments