Webdunia - Bharat's app for daily news and videos

Install App

'చిఛీ.. శీను ఇలాంటి వాడనుకోలేదు'.. ఛీకొడుతున్న పాలకొల్లు వాసులు

తన గజల్ గానంతో కేవలం సొంతూరుకే కాదు.. స్వరాష్ట్రానికి, మాతృదేశానికి కూడా ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చిన గజల్ కళాకారుడు గజల్ శ్రీనివాస్. తన గజల్స్‌ గానంతో ప్రజలందరినీ ఉర్రూతలూగించారు.

Webdunia
బుధవారం, 3 జనవరి 2018 (14:23 IST)
తన గజల్ గానంతో కేవలం సొంతూరుకే కాదు.. స్వరాష్ట్రానికి, మాతృదేశానికి కూడా ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చిన గజల్ కళాకారుడు గజల్ శ్రీనివాస్. తన గజల్స్‌ గానంతో ప్రజలందరినీ ఉర్రూతలూగించాడు. మాతృమూర్తిపైన, సమైక్యాంధ్రపైనా ఆయన పాడిన గజల్స్‌కు జనం జేజేలు పలికారు. ఇంత ఖ్యాతిగడించిన శ్రీనివాస్‌.. లైంగిక వేధింపుల కేసులో అడ్డంగా బుక్కయ్యాడు. ‘ఇదేం పాడుపని శీనూ’.. అంటూ సొంతూరి జనం ఛీత్కరించుకుంటున్నారు. 
 
గజల్ శ్రీనివాస్ సొంతూరు పాలకొల్లు. వెస్ట్ గోదావరి జిల్లా. ఆయన్ను పొగిడిన జనమే ఇపుడు ఛీకొడుతున్నారు. లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కున్న శ్రీనివాస్‌ తీరును ప్రతి ఒక్కరూ ఎండగడుతున్నారు. ఒకటికి రెండుసార్లు గజల్స్‌ కార్యక్రమాలతో తనకున్న ప్రతిభా పాఠవాలను ప్రదర్శించినప్పుడు సైతం ఆయనలో అలాంటి కోణం కనపడలేదని ఆయనకు దగ్గరగా ఉన్న వ్యక్తులు చెపుతున్నారు. 
 
గజల్ శ్రీనివాస్‌కు సంబంధించిన ప్రసారమాధ్యమాల్లో వస్తున్న వీడియో క్లిప్పింగులు చూసి వారంతా.. ‘చిఛీ, శీను ఇలాంటి వాడనుకోలేదని అంటున్నారు. టీవీల్లో ఇప్పుడు చూస్తున్న సీన్లు చూస్తుంటే పైకి కనిపించే వాళ్ళంతా మంచోళ్ళు కాదేమో అనే భావన కలుగుతోందని అంటున్నారు. మొత్తంమీద పశ్చిమ జిల్లా వాసిగా ఖండాంతరాల్లో ఖ్యాతి గడించిన గజల్ శ్రీనివాస్ ఇపుడు నవ్వులపాలయ్యాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం