Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'గజల్' భార్యకు కూడా చెప్పాను.. పార్వతికి భర్త ఉన్నా 'శ్రీనివాస్‌'తో...

'గజల్' కళాకారుడు 'గజల్' శ్రీనివాస్ లైంగిక వేధింపుల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తనను శ్రీనివాస్ లైంగికంగా వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ అన్ని విషయాలు పూసగు

Advertiesment
'గజల్' భార్యకు కూడా చెప్పాను.. పార్వతికి భర్త ఉన్నా 'శ్రీనివాస్‌'తో...
, బుధవారం, 3 జనవరి 2018 (10:55 IST)
'గజల్' కళాకారుడు 'గజల్' శ్రీనివాస్ లైంగిక వేధింపుల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తనను శ్రీనివాస్ లైంగికంగా వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ అన్ని విషయాలు పూసగుచ్చినట్టు వివరించింది. 
 
'గజల్‌’ వేధింపులపై ఆయన భార్యకు కూడా చెప్పాను. కానీ ఫలితం లేకపోయింది. ఇక.. పనిమనిషి పార్వతి నాతో నీచంగా మాట్లాడేది. సార్‌తో బాగా ఉంటే నీవు కూడా బాగుంటావు అని చెప్పేది. తనకు భర్త ఉన్నా ఇప్పటికీ గజల్‌ శ్రీనివాస్‌తో సెక్స్‌లో పాల్గొంటానని నిస్సిగ్గుగా చెప్పేది. ఆయన దగ్గరకు వెళ్లాలని పదేపదే చెప్పేది' అని వెల్లడించింది. 
 
గడిచిన 8 నెలలుగా 'ఆలయవాణి' వెబ్‌రేడియోలో ఆర్జేగా పని చేస్తున్నాను. ఆయన అందులో ‘సేవ్‌ టెంపుల్‌’ పేరుతో కార్యక్రమాన్ని చేపడుతుండటంతో నాకు కూడా ఆధ్యాత్మిక భావాలు ఉండటంతో అక్కడే ఆర్జేగా పని చేసేందుకు ఇష్టపడ్డాను. అయితే ఆయన.. "నాతో బాగుండాలి, అన్ని రకాలుగా సహకరించాలి. నేనే ప్రపంచంగా ఉండాలి. నేనేం చెబితే అలా చేస్తే నీ ఫ్యూచర్‌ బావుంటుంది" అని నాతో ఎప్పుడూ అంటుండేవారు. ఆయన మాటల్లోని పరమార్థం గ్రహించి ఆయన నుంచి తప్పించుకోడానికి ప్రయత్నించేదాన్ని. దీంతో ఎక్స్‌పీరియెన్స్‌ సర్టిఫికెట్‌ ఇవ్వనని.. వేరే ఎక్కడా జాబ్‌లో జాయిన్‌ అవ్వకుండా చేస్తానని పలుమార్లు బెదిరించారని చెప్పారు. 
 
ఇకపోతే, "గజల్‌ శ్రీనివాస్‌కు నేను మసాజ్‌ చేయలేదు. అతని నిజస్వరూపాన్ని బయట పెట్టడానికే కాళ్లు పట్టుకోవాల్సి వచ్చింది. నన్ను నేను ప్రతిక్షణం కాపాడుకునేదాన్ని. ఆయన అకృత్యాలపై పోలీస్‌ స్టేషన్‌కు ప్రూఫ్‌తో వచ్చాను. ఆయన ఎంత నీచుడో ఆ వీడియోలు చూస్తే తెలుస్తుంది" అని ఆమె వివరించారు. గజల్‌ శ్రీనివాస్‌ వల్ల మోసపోయిన వారు, వేధింపులకు గురైనవారు ఉన్నారో లేదో నాకు తెలియదు. ఉంటే మాత్రం వారు కూడా నాలాగే ధైర్యంగా బయటికి రావాలని బాధితురాలు కుమారి పిలుపునిచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మ వీడియోపై 100 ప్రశ్నలు.. తడబడిన శశికళ మేనకోడలు