Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుంజువాన్ ఆర్మీ క్యాంపు దాడికి ప్రతీకారం తప్పదు : నిర్మలా సీతారామన్

జమ్మూకాశ్మీర్‌లో సుంజువాన్‌ ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు జరిపిన దాడికి ప్రతీకారం తప్పదని కేంద్ర రక్షణ నిర్మలా సీతారామన్ హెచ్చరించారు. ఈ దాడిలో ఐదుగురు భారత జవాన్లు మృతిచెందిన విషయం తెల్సిందే. దీనిపై ఆమె

Webdunia
మంగళవారం, 13 ఫిబ్రవరి 2018 (11:33 IST)
జమ్మూకాశ్మీర్‌లో సుంజువాన్‌ ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు జరిపిన దాడికి ప్రతీకారం తప్పదని కేంద్ర రక్షణ నిర్మలా సీతారామన్ హెచ్చరించారు. ఈ దాడిలో ఐదుగురు భారత జవాన్లు మృతిచెందిన విషయం తెల్సిందే. దీనిపై ఆమె స్పందిస్తూ, ఈ దుస్సాహసంపై పాకిస్థాన్ మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు.
 
పాకిస్థాన్ వెనకేసుకొస్తోన్న జేఈఎమ్ ఉగ్రదాడికి ప్రణాళిక రూపొందించిందన్నారు. ప్రతి దాడులు జరిపిన భారత ఆర్మీ ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చిందని చెప్పారు. ఈ ఉగ్రదాడి ఎవరు చేశారన్న దానిపై తాము ఇప్పటికే ఆధారాలు సంపాదించామని, పాక్ ప్రభుత్వానికి వాటిని పంపుతామని చెప్పారు.
 
తాము ఆధారాలు పంపుతున్నప్పటికీ పాక్ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని, అయినప్పటికీ తాము ఈ సారి కూడా ఆ ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదానికి భారత్ ధీటుగా జవాబు ఇస్తూనే ఉందని చెప్పారు. అంతకు ముందు ఆమె జమ్మూలోని మిలటరీ హాస్పిటల్‌కి వెళ్లి సుంజువాన్ ఉగ్రదాడిలో గాయాలపాలైన వారిని కలిశారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments