Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో నేడు విశ్వవిద్యాలయాల బంద్

Webdunia
బుధవారం, 24 ఆగస్టు 2022 (11:57 IST)
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం విశ్వవిద్యాలయాల బంద్‌కు ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థి సంఘం జేఏసీ పిలుపునిచ్చింది. బాసరలోని ట్రిపుల్ ఐటీ విద్యాలయంలో సురేష్ అనే మొదటి సంవత్సరం విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి నిరసనగా ఈ బంద్ నిర్వహిస్తున్నట్టు జేఏసీ ప్రకటించింది. 
 
పైగా, ఈ విద్యార్థి మృతికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సురేష్ మృతి ప్రభుత్వ హత్యేనని, విద్యార్థి కుటుంబానికి రూ.కోటి పరిహారం అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 
 
హాస్టల్ గదిలో విద్యార్థి ఆత్మహత్య
తెలంగాణ రాష్ట్రం, బాసరలో ఉన్న ట్రిబుల్ ఐటీలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని సురేష్‌గా గుర్తించారు. హాస్టల్‌లోని తన గదిలోనే ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. డిచ్ పల్లికి చెందిన సురేష్‌గా గుర్తించారు.  
 
అయితే, ఈ విద్యార్థి ఓ యువతిని ప్రేమిస్తూ వచ్చాడని, ఈ ప్రేమ వ్యవహారం కారణంగానే ఆత్మహత్య చేసుకునివుంటాడని సహచర విద్యార్థులు అనుమానిస్తున్నారు. ఉరివేసుకున్న స్థితిలో సురేష్‌ను గుర్తించిన సహచర విద్యార్థులు వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అతన్ని పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్టు వెల్లడించారు. ఈ విద్యార్థి ట్రిపుల్ ఐటీలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments