Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడలో యువకుడి అవయవదానం...

విజయవాడ: విజ‌యవాడ‌లో అక‌స్మాత్తుగా మృతి చెందిన ఒక యువ‌కుడి అవ‌య‌వ దానం ఆఘ‌మేఘాల‌పై జ‌రిగిపోయింది. ఆ యువ‌కుడికి అవ‌యవాల‌న్నింటినీ దానం చేయ‌డానికి కుటుంబస‌భ్యులు ముందుకు రావ‌డంతో గ‌న్న‌వ‌రం నుంచి విమానంలో హైదరాబాదుకు గుండె, కాలేయం తీసుకెళ్లారు. విజ‌య‌వ

Webdunia
బుధవారం, 19 అక్టోబరు 2016 (22:05 IST)
విజయవాడ: విజ‌యవాడ‌లో అక‌స్మాత్తుగా మృతి చెందిన ఒక యువ‌కుడి అవ‌య‌వ దానం ఆఘ‌మేఘాల‌పై జ‌రిగిపోయింది. ఆ యువ‌కుడికి అవ‌యవాల‌న్నింటినీ దానం చేయ‌డానికి కుటుంబస‌భ్యులు ముందుకు రావ‌డంతో గ‌న్న‌వ‌రం నుంచి విమానంలో హైదరాబాదుకు గుండె, కాలేయం తీసుకెళ్లారు. విజ‌య‌వాడ‌లోని ఆంధ్ర ఆస్పత్రిలో ఈ యువకుడికి బ్రెయిన్ డెడ్ అయింది. 
 
అచేత‌నంగా కొద్ది రోజులు చికిత్స పొంది మృతి చెందిన ఆ యువకుడి అవయవాల దానానికి కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. కేవ‌లం తలనొప్పి, జ్వరంతో అపస్మారక స్థితిలోకి ఆ యువ‌కుడు వంశీకృష్ణ చివ‌రికి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల నిర్ణయంతో ఆంధ్ర ఆస్పత్రిలో జీవన్ దాన్‌కు ఏర్పాట్లు చేశారు.
 
ఉదయం 9 నుంచి 10 మధ్య గ్రీన్ ఛానల్ ద్వారా అవయవాల తరలింపు చేశారు. గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు గుండె, కాలేయం తరలించారు. మూత్రపిండాలు, కళ్లు విజయవాడ ఆస్పత్రుల్లోని బాధితులకు వినియోగించారు. జగ్గయ్యపేట మండవ ఇంజినీరింగ్ కళాశాలలో నెట్ వర్క్ అడ్మినిస్ట్రేటర్ గా వంశీకృష్ణ ప‌నిచేసేవాడు. ఆయ‌న అవ‌య‌వ దానం వ‌ల్ల జీవ‌న్ దాన్ చేసిన‌ట్ల‌యింద‌ని వైద్య నిపుణులు చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యూఫోరియా మ్యూజికల్ నైట్ లో ప్రతి ఒక్క రూపాయి సమాజ సేవకే : నారా భువనేశ్వరి

పుష్ప 2 కలెక్షన్స్ రూ. 1850 కోట్లు వచ్చాయా? లెక్కలేవీ అని ఐటీ అడిగిందా?

హాసం రాజా ఆపాతమధురం -2 పుస్తకావిష్కరణ

విశ్వక్సేన్, లైలా సెకండ్ సింగిల్ ఇచ్చుకుందాం బేబీ రాబోతుంది

పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో సత్యరాజ్, ఉదయ భాను చిత్రం బార్భరిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ బాదం తినడం వల్ల కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలు

Golden Milk: గోల్డెన్ మిల్క్ హెల్త్ బెనిఫిట్స్

అంజీర్ పండ్లు అద్భుత ప్రయోజనాలు

కర్నూలుకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఫెర్టిలిటీ కేర్‌ను తీసుకువచ్చిన ఫెర్టీ9

భారతదేశంలో డిజిటల్ హెల్త్ అండ్ ప్రెసిషన్ మెడిసిన్ సెంటర్‌: లీసెస్టర్ విశ్వవిద్యాలయంతో అపోలో భాగస్వామ్యం

తర్వాతి కథనం
Show comments