Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థుల‌కు ఆన్‌లైన్‌లో ప‌ద్య‌, శ‌త‌క పోటీలు‌

Webdunia
శుక్రవారం, 22 మే 2020 (23:03 IST)
శ్రీధ‌ర్మ ప‌రిష‌త్ మ‌హాసంస్థానం, చాణక్య మిత్ర‌మండ‌లి విజ‌య‌వాడ సంయుక్త ఆధ్వ‌ర్యంలో విద్యార్థ్థినీ, విద్యార్థుల‌కు ‌వివిధ అంశాల‌పై ఆన్‌లైన్ పోటీలు నిర్వ‌హిస్తున్న‌ట్లు కార్య‌క్ర‌మ స‌మ‌న్వ‌య‌క‌ర్త విష్ణుభ‌ట్ల జ‌య‌ప్ర‌కాష్ శుక్ర‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

ప‌ద్యం, శ‌త‌కాల‌కు సంబంధించి మూడు కేట‌గిరిల్లో జ‌రిగే ఈ పోటీల్లో 3 నుంచి 7వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు చాణ‌క్య నీతిచంద్రిక అనే అంశంపైన, 8 నుంచి 10వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు ఆంధ్రనాయ‌క శ‌త‌కం అనే అంశంపైన, ఇంట‌ర్ ఆపైన విద్యార్థుల‌కు స‌ర‌స్వ‌తీదేవి వ‌ర్ణ‌న‌ అనే అంశంపై అర్థ‌‌సహిత‌మైన ప‌ద్యాలు, శ‌త‌కాలను చ‌దువుతూ ఐదు నిమిషాలు నిడివి గ‌ల దృశ్యాన్ని చిత్రీక‌రించి chanakyamitramandali@gmail.comకి మెయిల్ చేయాల్సి ఉంటుంద‌న్నారు.

అలాగే పోటీల్లో పాల్గొనే విద్యార్థులు సంబంధిత అంశాలను కూడా ఆన్‌లైన్‌లోనే డౌన్‌లోడ్ చేసుకోవాల‌ని పేర్కొన్నారు. మూడు కేట‌గిరిల్లోనూ గెలుపొందిన విజేత‌ల‌కు ప్ర‌ధ‌మ‌, ద్వితీయ‌, తృతీయ బ‌హుమ‌తులు అంద‌జేస్తామ‌న్నారు. స‌ర‌స్వ‌తీదేవి వ‌ర్ణ‌న అనే అంశంపై పాల్గొనే ఇంట‌ర్ ఆపైన విద్యార్థులు మాత్రం 9393380220 వాట్సాప్ నెంబ‌రుకు సందేశాన్ని పంపించ‌డంతో పాటుగా ఆన్‌లైన్‌లో ముఖాముఖీ కార్య‌క్ర‌మంలో పాల్గొనాల్సి ఉంటుంద‌ని తెలిపారు.

ఈ పోటీల్లో పాల్గొనాల‌నుకునే 7వ త‌ర‌గ‌తిలోపు విద్యార్థులు ఈ నెల 23వ తేదీలోగా, అలాగే 10వ త‌ర‌గ‌తిలోపు విద్యార్థులు ఈ నెల 24వ తేదీలోగా ఇంట‌ర్ ఆపైన విద్యార్థులు ఈ నెల 25వ తేదీలోగా వారు ఎంచుకున్న అంశంపై చిత్రీక‌రించిన వీడియోల‌ను మెయిల్‌కి పంపించాల్సి ఉంటుంద‌ని తెలిపారు.

శ్రీధర్మ పరిషత్ మహా సంస్థానం వ్యవాస్థాపకులు అవ్వా హేమసుందర వరప్రసాద్ (రాజా) గారి సహకారం, పర్యవేక్షణ లో నిర్వహిస్తున్నట్లు  స‌మ‌న్వ‌య‌క‌ర్త విష్ణుభ‌ట్ల జ‌య‌ప్ర‌కాష్ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాది చిత్రాల్లో హీరోయిన్లకు ప్రాధాన్యత ఎక్కడ?

కొత్త లోకా: చాప్టర్ వన్ – చంద్ర రివ్యూ, దుల్కర్ సల్మాన్, కల్యాణీ ప్రియదర్శన్ కు మార్కులు

Allu Family: విశాఖలో చిక్కుకున్న పవన్ కల్యాణ్.. వైరల్ అవుతున్న పాత ఫోటోలు

అల్లు కనకరత్నం కు నివాళి అర్పించిన రామ్ చరణ్, అన్నాలెజినోవా

అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments