కోవిడ్ లాక్‌డౌన్ కారణంగా అంతర్జాతీయ విమానాల రద్దు కావడంతో చివరి నిమిషములో హిత్రో విమానాశ్రయం చిక్కుపోయిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన పలువురు విధ్యార్ధులు, ట్రాన్ సీట్ ప్రయాణికులు ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు.
వారితో ఎపి సి.ఐ.డి(ఎన్‌ఆర్‌ఐ.సెల్), ఎపి ఎన్.ఆర్.టి సమన్వయంతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆంధ్ర ప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌతమ్ సవాంగ్ విధ్యార్డులతో మాట్లాడారు.
ఈ సంధర్భంగా విధ్యార్డులు మాట్లాడుతూ.. తాము ఎదుర్కుంటున్న సమస్యలు, ప్రస్తుతం COVID-19 వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో లండన్ పై ప్రభావం చూపితే విధ్య, వైద్యం, ఉద్యోగ రంగాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తపరుస్తూ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి తక్షణమే తమను భారత దేశానికి తీసుకొని వచ్చేందుకు అన్నీ చర్యలు తీసుకోవాలని వారు డిజిపిని కోరారు.
దీనిపై స్పందించిన డిజిపి తక్షణమే ఈ సమస్యను కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వల దృష్టికి తీసుకొని వెళ్ళి, వీలైనంత త్వరలో భారత దేశానికి తీసుకొని వచ్చేందుకు అన్నిచర్యలు తీసుకుంటామని విద్యర్ధులకు భరోసా ఇస్తూ, ఆంధ్ర ప్రదేశ్ సి.ఐ.డి(ఎన్‌ఆర్‌ఐ.సెల్) అధికారులకు మరియు ఎపి ఎన్.ఆర్.టి ప్రతినిధులకు విధ్యార్ధులతో నిరంతరం అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
డిజిపి స్పందనపై విధ్యార్డులు హర్షం వ్యక్తం చేస్తూ ఇప్పటివరకు భారతదేశం నుండి ఏ శాఖ తమ సమస్యలపై పట్టించుకోలేదు అని, తమ సమస్యల పై స్పందించినందుకు డిజిపికి ,ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.