Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏకాంతం కోసం వస్తే ప్రియుడిని కట్టేసి ప్రియురాలిపై అత్యాచారం.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 21 జులై 2019 (10:13 IST)
వారిద్దరూ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. త్వరలోనే పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించారు కూడా. ఇంతలోనే ప్రియుడు కళ్ళముందే ప్రియురాలు అత్యాచారానికి గురైంది. కొద్దిసేపు ఏకాంతంగా గడిపేందుకు వచ్చిన సమయంలో ఈ దారుణం జరిగింది. ఈ దారుణం ప్రకాశం జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ప్రకాశం జిల్లా చీరాల పట్టణం విఠల్‌ నగర్‌‌కు చెందిన ఓ యువతి (25)కి మూడేళ్ల క్రితం వివాహం కాగా, ప్రస్తుతం భర్త నుంచి విడాకులు పొంది, తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఆమె ఓ దుకాణంలో పని చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఓ యువకుడితో పరిచయం ఏర్పడి అది వారిద్దరి మధ్య ప్రేమకు దారితీసింది. 
 
వీరిద్దరూ శుక్రవారం రాత్రి ఏడు గంటల సమయంలో కారంచేడు సమీపంలోని వంతెన వద్దకు వెళ్లి మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో మరో బైక్‌పై వచ్చిన ముగ్గురు యువకులు వారిని నిర్బంధించారు. వారి సెల్‌ఫోన్, దగ్గరున్న డబ్బు దోచుకున్నారు. 
 
ఆ తర్వాత యువకుడుని ఓ చెట్టుకు కట్టేసి.. యువతిని లాక్కెళ్లి అత్యాచారం చేశారు. ఆ తర్వాత కామాంధులు పారిపోయి. అక్కడ నుంచి ప్రాణాలతో బయటపడిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసును నమోదు చేశామని, నిందితులను పట్టుకునేందుకు ముగ్గురు ఎస్సైల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments