Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక రోజు వ‌స్తుంది, అపుడు మీకూ ఇబ్బందులు త‌ప్ప‌వు: చంద్ర‌బాబు

Webdunia
మంగళవారం, 13 జులై 2021 (18:10 IST)
రాజకీయ కక్ష సాధింపు కోసమే ధూళిపాల‌ నరేంద్రను అరెస్ట్ చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. మంగళవారం చింతలపూడికి వచ్చిన చంద్రబాబు, ధూళిపాళ్ల నరేంద్ర కుటుంబ సభ్యలను పరామర్శించారు.

ధూళిపాళ్ల నరేంద్రది రాజకీయ చరిత్ర గల కుటుంబమని,  మూడు దశాబ్దాలుగా ప్రజలకు సేవలు అందిస్తున్నారని తెలిపారు. రైతులకు ధూళిపాళ్ల వీరయ్య చౌదరి, నరేంద్ర ఎనలేని సేవలు చేశారని చెప్పారు. అలాంటి కుటుంబానికి చెందిన నరేంద్రను అరెస్టు చేయటం దుర్మార్గమని అన్నారు. ఇలాంటి పరిణామాలు రాజకీయాల్లో మంచిది కాదని సూచించారు. 
 
సహకార రంగం నుంచి కంపెనీ చట్టంలోకి సంగం డెయిరీ చట్ట ప్రకారమే వెళ్లిందని, కానీ నరేంద్రను అమానుషంగా అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు కనీసం నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేశారని పార్టీ అధినేత అన్నారు. తీవ్రవాదులను తీసుకెళ్లినట్లు అరెస్టు చేశారని మండిపడ్డారు. భవిష్యత్తులో ఓ రోజు వస్తుందని, అపుడు మీకూ ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. అచ్చన్నాయుడుతో మొదలైన అరెస్టులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయన్నారు.

నాయకుడు తప్పు చేస్తే ఎక్కడ చేశారో చెప్పాలని, కనీసం సాక్ష్యాలు లేకుండా అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. తప్పుడు పనులు చేసేది తమరు అని విమర్శించారు. ‘‘నరేంద్ర ఆస్తులు గతంలో ఎంత? ఇప్పుడు ఎంతో చూడండి...2004కు ముందు జగన్ కుటుంబ ఆస్తులు, ఇప్పుడు ఆస్తులు చూడండి’’ అని తెలిపారు. నరేంద్రకు కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ధర్మం కోసం న్యాయం కోసం ప్రజలు కూడా అండగా నిలవాలన్నారు. ప్రజల కోసమే వైసీపీ అరాచకాలు భరిస్తున్నామని చంద్రబాబు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments