Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్-ఒడిశాల మధ్య కొటియా వివాదం.. ఏపీ సర్కారుకు ఆదేశాలు

Webdunia
శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (21:07 IST)
ఆంధ్రప్రదేశ్-ఒడిశా ప్రభుత్వాల మధ్య కొటియా వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. ఒడిశా ప్రభుత్వం దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై సుప్రీంలో విచారణ కొనసాగింది. తమ భూభాగంలోని మూడు గ్రామ పంచాయతీల పేర్లు మార్చి ఏపీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తోందని గతంలో ఒడిశా ప్రభుత్వం పిటిషన్‌ వేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ భూభాగంలోని మూడు గ్రామ పంచాయతీల పేర్లను మార్చి ఎన్నికలను నిర్వహిస్తోందని ఆరోపిస్తూ పిటిషన్‌లో పేర్కొంది. 
 
ఒడిశా అభ్యంతరాలపై వచ్చే వారం లోపు సమాధానం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఏపీ ప్రభుత్వం తరఫున విజయనగరం జిల్లా కలెక్టర్‌ కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేశారు. కోటియా పరిధిలోని 3 గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌లో భాగమేనని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం గతంలోనూ అక్కడ పంచాయతీ ఎన్నికలు నిర్వహించినట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. 
 
అరకు పార్లమెంట్‌ నియోజకవర్గం, సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి మూడు గ్రామాలు వస్తాయని స్పష్టం చేశారు. ఒడిశా పిటిషన్‌ కొట్టివేయాలని విజయనగరం కలెక్టర్‌ విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై సమాధానం ఇచ్చేందుకు ఒడిశా ప్రభుత్వం నాలుగువారాల గడువు కోరింది. దీంతో ఈకేసు తదుపరి విచారణను జస్టిస్‌ ఖన్‌ విల్కర్‌ ధర్మాసనం నాలుగు వారాలకు వాయిదా వేసింది. 

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments