Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలికి ఒంటెను బర్త్‌డే గిఫ్టుగా ఇచ్చి జైలుపాలైన ప్రియుడు

Webdunia
శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (20:08 IST)
సాధారణంగా తమ ప్రియుడు, ప్రియురాలి పుట్టిన రోజులకు ఖరీదైన బహుమతులు ఇచ్చుకోవడం సహజం. ముఖ్యంగా ప్రియురాలి బర్త్‌డేకు విలువైన గిఫ్టులిచ్చిన సర్‌ప్రైజ్ చేయాలని ప్రియుడు భావిస్తుంటారు. అలా, ఓ ప్రియుడు.. తన ప్రియురాలి పుట్టిన రోజుకు ఏకంగా ఓ ఒంటె పిల్లను దొంగిలించి బహుమతిగా ఇచ్చాడు. ఈ విషయం బయటకు పొక్కడంతో ఈ ప్రేమికులిద్దరూ జైలుపాలయ్యారు. ఈ ఘటన దుబాయ్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఓ ప్రియుడు తన ప్రియురాలి పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకుని అరుదైన, అత్యంత విలువైన అపుడే జన్మించిన ఒంటె పిల్లను బహుమతిగా ఇచ్చాడు. దీంతో ఆ ప్రియురాలు కూడా తెగ సంతోషపడింది.
 
ఈ క్రమంలో తన ఒంటె పిల్ల కనిపించడం లేదని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులకు విచారణ చేపట్టారు. ఇంతలో ఓ వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి.. తన ఫామ్‌హౌస్‌లో ఓ ఒంటె పిల్ల తిరుగుతుందని సమాచారం అందించాడు. 
 
అయితే మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫామ్‌హౌస్‌ల మధ్యే ఒంటె గల్లంతైనట్టు పోలీసులు గుర్తించారు. ఇటీవలే జన్మించిన ఒంటె అంతదూరం నడిచి రావడంపై సందేహాలు రావడంతో పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. 
 
తాను ఆ ఒంటెను దొంగిలించానని, అరుదైన ఖరీదైన ఒంటెను తన గర్ల్‌ఫ్రెండ్‌కు బహుమతిగా ఇచ్చేందుకు ఈ పని చేశానని అనుమానితుడు అంగీకరించాడు. ఒంటెను తిరిగి యజమానికి అప్పగించిన పోలీసులు నిందితుడితో పాటు అతడి గర్ల్‌ఫ్రెండ్‌ను అరెస్ట్‌ చేశారు. చోరీ, తప్పుడు స్టేట్‌మెంట్‌లు ఇచ్చినందుకు వారిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments