Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమాల్లో అవకాశం ఇస్తానని.. అశ్లీల షార్ట్ ఫిల్మ్‌లో నటింపజేశారు..

సినిమాల్లో అవకాశం ఇస్తానని నమ్మించి.. ఓ స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న ఓ యువతిని మోసగించిన సంఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే... 24 ఏళ్ల యువతి ఓ ప్రైవేట్ ఆస్పత్రి సాఫ్ట్ న

Webdunia
ఆదివారం, 13 ఆగస్టు 2017 (11:16 IST)
సినిమాల్లో అవకాశం ఇస్తానని నమ్మించి.. ఓ స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న ఓ యువతిని మోసగించిన సంఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే... 24 ఏళ్ల యువతి ఓ ప్రైవేట్ ఆస్పత్రి సాఫ్ట్ నర్సుగా పనిచేస్తుంది. ఆమె తమ్ముడి ద్వారా లోక్‌నాథ్ పరిచయం అయ్యాడు. సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానంటూ ఆ యువతిని తన తల్లి విజయలక్ష్మి వద్దకు లోక్‌నాథ్ తీసుకువెళ్లి పరిచయం చేశాడు. 
 
ఈ క్రమంలో ఆమెకు ఓ సినిమాలో చిన్నపాత్రలో నటించే అవకాశం కల్పించడమే కాకుండా, మూడువేల రూపాయల పారితోషికం కూడా ఇచ్చారు. దీంతో ఆ నర్సుకు నమ్మకం పెరిగింది. ఈ క్రమంలో ఓ షార్ట్ ఫిల్మ్‌లో నటించేందుకూ ఆ యువతి అంగీకరించింది. ఆ యువతితో ఓ తెల్ల కాగితంపై  సంతకం చేయించుకున్న విజయలక్ష్మి, యూనిట్ సభ్యులతో ఆమెను షూటింగ్‌కు పంపింది. ఆపై గుర్తు తెలియని ప్రదేశానికి ఆమెను తీసుకువెళ్లి వారు అసభ్యంగా ప్రవర్తించారు. 
 
వెంటనే విజయలక్ష్మికి ఫోన్ చేసిన బాధితురాలు చెప్పగా.. వాళ్లు ఎలా చెబితే అలా చెయ్యమని.. లేకుంటే వేరే కేసులో ఇరికిస్తానని విజయలక్ష్మి బెదిరించింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో యూనిట్ సభ్యులు చిత్రీకరించిన పది అశ్లీల షార్ట్ ఫిల్మ్స్‌లో ఆ యువతి నటించాల్సి వచ్చింది. 
 
దర్శకుడు దుర్గారావు అసభ్యంగా ప్రవర్తించిన విషయాన్ని తన పరువు పోతుందనే భయంతో ఈ విషయాన్ని దాచేసింది. ఆన్ లైన్‌లో ఆ షార్ట్ ఫిల్మ్స్ ఇటీవల పెట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్‌డమ్ నుండి విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బొర్సె ముద్దులతో హృదయం పాట ప్రోమో

కింగ్ జాకీ - క్వీన్ యూనిక్ యాక్షన్ మూవీ: దీక్షిత్ శెట్టి

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్

జ్యోతి పూర్వజ్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

రజనీకాంత్ 'జైలర్-2'లో 'లెజెండ్' బాలకృష్ణ? - నెట్టింట వైరల్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

తర్వాతి కథనం
Show comments