వైసిపిలోకి జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే...

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్‌టిఆర్ మామ నార్నే శ్రీనివాసరావు ప్రముఖ పారిశ్రామికవేత్తగాను, మీడియా ఛానల్ అధిపతిగాను వున్నారు. నార్నే శ్రీనివాస్ పొలిటికల్ ఎంట్రీపై గత ఎన్నికలకు ముందే వార్తలొచ్చాయి. రాజకీయంగా 2009 ఎన్నికల్లో ఫుల్‌గా సపోర్ట్ చేసిన ఆయన ఆ

Webdunia
శనివారం, 11 నవంబరు 2017 (13:52 IST)
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్‌టిఆర్ మామ నార్నే శ్రీనివాసరావు ప్రముఖ పారిశ్రామికవేత్తగాను, మీడియా ఛానల్ అధిపతిగాను వున్నారు. నార్నే శ్రీనివాస్ పొలిటికల్ ఎంట్రీపై గత ఎన్నికలకు ముందే వార్తలొచ్చాయి. రాజకీయంగా 2009 ఎన్నికల్లో ఫుల్‌గా సపోర్ట్ చేసిన ఆయన ఆ తరువాత తన అల్లుడు ఎన్‌టిఆర్‌కు చంద్రబాబు, బాలయ్యలతో గ్యాప్ రావడంతో టిడిపితో అంటీముట్టనట్లు వ్యవహరించారు. గత ఎన్నికల్లో శ్రీనివాస్ వైసిపిలో చేరి క్రిష్ణా, గుంటూరు జిల్లాల్లో ఏదో ఒక సీటు నుంచి ఎంపిగా, లేక పెనుములూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని వార్తలు వచ్చినా, ఆ తరువాత ఆయన సైలెంట్ అయ్యారు. 
 
ఐతే తాజాగా నార్నే శ్రీనివాస్ వైసిపిలో  చేరుతారంటూ మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. ఈయనది గుంటూరు జిల్లానే. ఈ నేపథ్యంలో ఆయన వైసిపి నుంచి గుంటూరు జిల్లాలోని చిలకూరిపేట నుంచి పోటీ చేస్తారనేది టాక్. ప్రస్తుతం ఈ ప్రాంతంలో వైసిపి ఇన్‌ఛార్జ్‌గా మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ ఉన్నారు. 2004లో రాజశేఖర్ గెలిచినా, 2009, 2014ఎన్నికల్లో ఓడిపోయారు. మంత్రి పత్తిపాటి పుల్లారావు చేతిలోను ఈయన ఓడిపోయారు. 
 
అయితే రాజశేఖర్ మామ మాజీ ఎమ్మెల్యే సాంబయ్యకు గ్రామాల్లో ఎప్పటి నుంచో మంచి పట్టు ఉంది. అయితే ఇంత సపోర్టు ఉన్నా రాజశేఖర్‌కు అనారోగ్యం కారణంగా గత కొన్నినెలల నుంచి అక్కడ సరైన నాయకుడు వైసిపికి లేడనేది టాక్. ఇదంతా నార్నే శ్రీనివాసరావుకు బాగా కలిసొస్తోంది. ఆర్థికంగా ఖర్చు పెట్టుకోగలడు.. పార్టీకి బాగా ఉపయోగపడగలడు కాబట్టి నార్నేకు ఈ సీటు ఇవ్వడం దాదాపు ఖాయమైనట్లేనని చెప్పుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments