Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అడ్డదారిలో మంత్రి అయిన పప్పబ్బాయ్... : రోజా ఫైర్

వైకాపా ఎమ్మెల్యే, సినీనటి రోజా మరోమారు మండిపడ్డారు. సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ అడ్డదారిలో మంత్రి అయ్యారంటూ విమర్శించారు. పనిలోపనిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై కూడా ఆమె తీవ్రస్థాయి

అడ్డదారిలో మంత్రి అయిన పప్పబ్బాయ్... : రోజా ఫైర్
, శుక్రవారం, 10 నవంబరు 2017 (14:33 IST)
వైకాపా ఎమ్మెల్యే, సినీనటి రోజా మరోమారు మండిపడ్డారు. సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ అడ్డదారిలో మంత్రి అయ్యారంటూ విమర్శించారు. పనిలోపనిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై కూడా ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
 
శుక్రవారం నుంచి ప్రధాన ప్రతిపక్షం లేకుండానే ఏపీ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈనేపథ్యంలో రోజా మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నాయకుడిగా ఎలా వ్యవహరించాలి, ఎలా నిలదీయాలో ఇప్పటి నుండే లోకేష్‌కు నేర్పిస్తున్నారన్నారు. అడ్డదారిలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్... విపక్షంలేని సమయంలో చూసి అసెంబ్లీ మాట్లాడారని గుర్తుచేశారు. 
 
మూడున్నర సంవత్సరాల్లో ప్రజా సమస్యలను ప్రస్తావించిన జగన్‌కు సమాధానం చెప్పలేని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారన్నారు. ప్రతి సమస్యపై జగన్ పోరాడుతూ సూచనలు.. సలహాలు ఇచ్చారన్నారు. జగన్‌ను వైసీపీ ఎమ్మెల్యేలను దూషిస్తూ పబ్బం గడుపుకుంటున్నారని... ప్రజాస్వామ్యం ఖూనీ జరుగుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 
 
అదేసమయంలో ప్రజాసమస్యలు తెలుసుకోవడానికే తమ పార్టీ అధినేత పాదయాత్ర చేపట్టారని గుర్తుచేశారు. ఏ సమస్య లేదని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొనడం సిగ్గుచేటన్నారు. రోడ్లు, డ్రైనేజీలు సక్రమంగా ఉన్నాయా? నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయా? రైతు రుణమాఫీలు అమలయ్యాయా? వీటిపై ప్రతి గ్రామంలో చర్చించేదానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
 
అంతేకాకుండా, ఓటుకు కోట్లు కేసులో తెలంగాణలో అరెస్ట్ చేస్తారన్న భయంతో, పదేళ్ల పాటు హైదరాబాద్‌ను ఉమ్మడిగా వాడుకునే సౌలభ్యమున్నా, భయపడి హైదరాబాద్‌ను వదిలి పారిపోయి వచ్చిన వ్యక్తి చంద్రబాబేనని ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు. 
 
ఓటుకు కోట్లు కేసులో దొంగలా దొరికిపోయి, హైదరాబాద్ వదిలి అమరావతికి వచ్చి దొంగలా దాక్కున్న చంద్రబాబు, వైకాపా ఎమ్మెల్యేలను అడ్డంగా కొనుగోలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అటువంటి వ్యక్తికి జగన్‌ను విమర్శించే అర్హత, అధికారం లేవన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే జగన్ ప్రజల్లోకి వెళ్లారని స్పష్టంచేశారు. జగన్ ఉన్నప్పుడు అసెంబ్లీ పెట్టడానికే భయపడ్డారని రోజా అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబుకు ధైర్యముంటే జగన్‌తో పాటు నడవాలి: రోజా