Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

సెల్వి
సోమవారం, 31 మార్చి 2025 (21:25 IST)
Kalyan Ram
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ టీడీపీ జెండాను పట్టుకోవడం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కళ్యాణ్ రామ్ తెలుగుదేశం పార్టీ జెండాను పట్టుకున్న సంఘటన నరసరావుపేటలో జరిగింది. నరసరావుపేటలో చాలా చోట్ల భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. 
 
నందమూరి యువసేన అనే అభిమానుల సంఘం కళ్యాణ్ రామ్ రాకను పురస్కరించుకుని పోస్టర్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది.ఈ ఫ్లెక్సీలలో జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణలతో కలిసి ఉన్న కళ్యాణ్ రామ్ ఫోటోలు కనిపించాయి. కళ్యాణ్ రామ్ నారా లోకేష్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ల ఫొటోలు ఉన్న తెలుగుదేశం పార్టీ జెండాను పట్టుకుని ప్రదర్శించారు. 
 
ఈ సంఘటన నందమూరి కుటుంబంలో ఎటువంటి విభేదాలు లేవని, అందరూ ఐక్యంగా ఉన్నారని తెలియజేసింది. ఇటీవల లోకేష్ సైతం జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని తన చేతితో పట్టుకుని అభిమానులకు అభివాదం చేశారు. దీంతో వీరి మధ్య ఎలాంటి విభేదాలు లేదని స్పష్టం అయింది. 
 
ఇకపోతే.. సోదరి సుహాసిని తెలంగాణలో టీడీపీ చీఫ్ అయ్యే అవకాశం ఉంది. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తాడని చర్చ జరుగుతున్నప్పటికీ, ఆయన అలా చేస్తారా లేదా అనేది స్పష్టంగా తెలియదు. ఆయన సొంతంగా పార్టీ పెడతారా లేక టీడీపీలో చేరి తన తాతగారి పార్టీ పగ్గాలు చేపడతారా అనేది ఇంకా చెప్పలేం. 
 
మరోవైపు నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం అర్జున్ S/O వైజయంతి. ఏడాదిన్నర గ్యాప్ తర్వాత ఆయన్నుంచి రాబోతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కళ్యాణ్ రామ్ సోమవారం పల్నాడు జిల్లా నర్సరావుపేటలో సందడి చేశారు. 'అర్జున్ సన్నాఫ్ వైజయంతీ' సినిమా నుంచి 'నాయాల్ది' అనే ఫస్ట్ పాటని రిలీజ్ చేసారు. ఈ సందర్భంగా ఈ సినిమా 20 ఏళ్లు గుర్తుండిపోయేలా ఉంటుందని కళ్యాణ్ రామ్ చెబుతున్నారు. అందరు తల్లులకు ఈ చిత్రాన్ని అంకితం ఇవ్వబోతున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments