Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ 21వ వర్థంతి.. టీడీపీ అవినీతిపై పోరాటానికే వైసీపీలో చేరాను : లక్ష్మీ పార్వతి

ఎన్టీఆర్ 21వ వర్థంతిని పురస్కరించుకుని హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద గల ఎన్టీఆర్ సమాధి వద్ద లక్ష్మీ పార్వతి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ... ఎన్టీఆర్ సూచించిన మార్గంలో ఆయన ఆశయ సాధనకోస

Webdunia
బుధవారం, 18 జనవరి 2017 (09:31 IST)
ఎన్టీఆర్ 21వ వర్థంతిని పురస్కరించుకుని హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద గల ఎన్టీఆర్ సమాధి వద్ద లక్ష్మీ పార్వతి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ... ఎన్టీఆర్ సూచించిన మార్గంలో ఆయన ఆశయ సాధనకోసం పోరాటం సాగిస్తున్నాన్నారు. తెలుగుదేశం పార్టీ అవినీతిపై పోరాటం చేయడానికే తాను వైసీపీలో చేరానని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు.
 
మరోవైపు ఎన్టీ రామారావు 21 వర్ధంతి సందర్బంగా ఎన్టీఆర్ ఘాట్‌లో ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఎన్టీఆర్ కూతురు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సతీమణి అయిన భువనేశ్వరి, ఆమె కోడలు బ్రాహ్మణి, మనుమడు దేవాన్ష్‌ తదితరులు ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. కాగా... ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ, ఆయన కుమారులు కళ్యాణ్‌రామ్‌, జూ.ఎన్టీఆర్ తదితరులు కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులర్పించారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments