Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నారై జయరామ్‌ను హత్య చేసింది అతనే... విషపు సూది వేసి.. ఆపై బీరు బాటిల్‌తో తలపైకొట్టి...

Webdunia
ఆదివారం, 3 ఫిబ్రవరి 2019 (12:00 IST)
కృష్ణ జిల్లా నందిగామ వద్ద అనుమానాస్పదరీతిలో చనిపోయిన ఎన్నారై జయరామ్ కేసులోని చిక్కుముడులను పోలీసులు క్రమంగా విప్పుతున్నారు. జయరామ్‌ను హత్య చేసింది ఆయన మేనకోడలు శిఖా చౌదరి ప్రియుడేనని పోలీసులు ఓ ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. 
 
ఇటీవల జరిగిన ఎన్నారై జయరామ్ హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఆయన అమెరికా పౌరుడు కావడంత అమెరికా రాయబార కార్యాలయం కూడా ఈ కేసుపై ఆరా తీసింది. ఈ నేపథ్యంలో ఈ కేసులోని మిస్టరీని పోలీసులు ఛేదించారు. 
 
పోలీసులు మొదటి నుంచి భావిస్తున్నట్టుగానే ఆస్తి గొడవల కారణంగానే ఈ హత్య జరిగినట్టు తేలింది. ఈ దారుణానికి జయరామ్ మేనకోడులు శిఖా చౌదరితో కలిసి ఆమె ప్రియుడు రాకేష్ రెడ్డి పాల్పడినట్టు పోలీసులు తేల్చారు. 
 
రాకేష్ రెడ్డి, మరికొంతమంది కిరాయి హంతక ముఠా సభ్యులతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు నిర్థారించారు. రాకేష్‌రెడ్డి వద్ద తీసుకున్న నాలుగున్నర కోట్ల రూపాయల అప్పు విషయమై తలెత్తిన విభేదాలే హత్యకు కారణంగా నిలిచాయి. డబ్బు విషయంలో జయరాంతో విభేదాలు తలెత్తడంతో ప్రియురాలు శిఖాచౌదరితో కలిసి రాకేష్‌ అతన్ని అంతమొందించాలని నిర్ణయించాడు. 
 
తమ పథకం ప్రకారం కారులో జయరాంకు విషపూరిత ఇంజక్షన్‌ ఇచ్చి, అనంతరం బీర్‌ బాటిల్‌తో తపైకొట్టి హత్యచేసి ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి ఐదుగురు వ్యక్తులను కృష్ణా జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

సోమిరెడ్డి కోడలు శృతి రెడ్డి తో కలిసి డిజిటల్ క్లాస్ రూంను ప్రారంభించిన మంచు లక్ష్మి

Deverakonda: తిరుపతిలో దేవరకొండ కింగ్‌డమ్ గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్

Sunny: సన్నీ లియోన్ నటించిన త్రిముఖ నుంచి ఐటెం సాంగ్ గిప్పా గిప్పా షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments