కోవిడ్ రిపోర్టు తప్పుగా ఆర్థికంగా దెబ్బతీశారు... ఎన్ఆర్ఐ ఆస్పత్రిపై ఫిర్యాదు

Webdunia
గురువారం, 22 ఏప్రియల్ 2021 (16:52 IST)
కరోనా నెగిటివ్ వచ్చిన పాజిటివ్ గా తప్పుడు నివేదిక ఇచ్చి తనను మానసికంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎన్ఆర్ఐ ఆస్పత్రి వైద్యులు ఇబ్బంది పెట్టారని ఓ బాధితుడు ఆరోపించారు. ఈ వివరాల్లోకి వెళితే.. మంగళగిరి మండలం కాజా గ్రామానికి చెందిన కంకణాల శివ శంకర్ ఈనెల 20న ఎన్నారై ఆసుపత్రిలో కరోనా అనుమానంతో ఆర్‌‌టి‌పి‌సి‌ఆర్ పరీక్ష చేయించుకున్నారు. 
 
21వ తేదీ సాయంత్రం కరోనా పాజిటివ్‌గా నిర్ధారించి ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. ఈ నివేదికతో సంతృప్తి చెందని కంకణాల శివ శంకర్ 21వ తేదీన గుంటూరులోని ఆదిత్య హాస్పిటల్‌కి వెళ్లి సిటీ స్కాన్ ఇతర కోవిడ్ పరీక్షలు చేయించుకొన్నారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో కరోనా లేదని నివేదిక వచ్చింది. 
 
కరోనా పరీక్ష‌ల్లో నెగిటివ్‌గా వచ్చిందని రాష్ట్ర ప్రభుత్వ అ వైద్య ఆరోగ్య శాఖ నుంచి కంకణాల శివ శంకర్‌కు ఫోన్ మెసేజ్ వచ్చింది. అప్పటికే ఒకరోజు కరోనా చికిత్స మందులు శివ శంకర్ వేసుకున్నారు. 
 
అసలు తనకు కరోనా లేకున్నా ఉన్నట్లుగా తప్పుడు నివేదికను ఎన్ఆర్ఐ ఆస్పత్రి వైద్యులు ఇచ్చారని దీంతో తాను రెండు రోజులుగా తీవ్ర మానసిక వేదన చెందానని చెప్పారు. తప్పుడు నివేదిక తో తనను తీవ్ర క్షోభకు గురి చేసిన ఎన్నారై ఆసుపత్రి పై చర్యలు తీసుకోవాలని కణాల శివ శంకర్ డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments