Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్రీయవిద్యాలయాల్లోప్రవేశాలకు నోటిఫికేషన్

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (10:42 IST)
అధునాతన, సాంకేతిక విద్యా బోధనకు వేదికలైన కేంద్రీయ విద్యాలయాల్లో (కేవీ) ప్రవేశాలకు వేళయ్యింది. కొవిడ్‌ నేపథ్యంలో ఈ ఏడాది ప్రక్రియ కొంత ఆలస్యమైంది.

2021-22 విద్యా సంవత్సరానికి వచ్చే నెల 1 నుంచి మే 31వ తేదీకి ఇంటర్మీడియట్‌ మినహాయించి మిగిలిన అన్ని తరగతుల్లో ప్రవేశాలు పూర్తి చేసేందుకు ఆదివారం కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఒకటో తరగతిలో చేరితే ఇంటర్మీడియట్‌ వరకు చదువుకోవచ్ఛు దీంతో సీట్లు పొందేందుకు ఏటా విపరీతమైన పోటీ ఉంటుంది.

ఖాళీలు పదుల సంఖ్యలో ఉంటే దరఖాస్తులు వందలు, వేలల్లో వస్తున్నాయి. కృష్ణా జిల్లాలో మూడు విద్యాలయాలు ఉండగా విజయవాడలో రెండు, మరొకటి మచిలీపట్నంలో ఉంది.
 
దరఖాస్తు గడువు :
ఒకటో తరగతిలో ప్రవేశాలకు వచ్చే నెల 1వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రారంభమై 19వ తేదీ సాయంత్రం 7 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు అవకాశం ఉంది.

రెండో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఖాళీలను వచ్చే నెల 8వ తేదీ నుంచి 15వ తేదీలోపు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు వెల్లడైన 30 రోజుల్లోపు ఇంటర్మీడియెట్‌లో ఖాళీలను భర్తీ చేస్తారు
 
వయో పరిమితి : ఒకటో తరగతిలో ప్రవేశానికి 2021 మార్చి 31వ తేదీకి ఐదేళ్లు నిండి ఉండాలి. ఐదు నుంచి ఏడేళ్లలోపు వారికి మాత్రమే ప్రవేశం ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments