Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లల విషయంలో ఏమరుపాటు తగదు: గవర్నర్ హ‌రిచంద‌న్

Webdunia
గురువారం, 29 అక్టోబరు 2020 (06:42 IST)
పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడు మండలంలో ఆరుగురు విద్యార్థులు మృతి చెందిన విషాద సంఘటన పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు.

ఈ మేరకు రాజ్ భవన్ నుండి ఒక ప్రకటన విడుదల చేశారు. వసంతవాడ సమీపంలో బుధవారం ఈ సంఘటన చోటుచేసుకోగా, ఈత కొట్టేందుకు వాగులోకి వెళ్ళిన చిన్నారులు ప్రాణాలు కోల్పోవటం బాధాకరమన్నారు.

భూదేవిపేట గ్రామానికి చెందిన పలు కుటుంబాలు వన భోజనాలు చేసేందుకు పెదవాగుకు వెళ్ళ‌గా సరదాగా ఈత కొట్టేందుకు వాగులోకి దిగిన గొట్టుపర్తి మనోజ్‌(16), కోనవరపు రాధాకృష్ణ(16), కర్నాటి రంజిత్‌(16), శ్రీరాముల శివాజి(17), గంగాధర్‌ వెంకట్‌(17), చల్లా భువన్‌(18) గల్లంతయ్యారు.

గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చేపట్టి గల్లంతైన వారి మృతదేహాలను వెలికితీశారు. ఈ క్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులకు తన సానుభూతిని ప్రకటించిన గవర్నర్ హరిచందన్, పిల్లల విషయంలో ఏమరుపాటు తగదని హితవు పలికారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఆవిష్కరించిన ప్రిన్స్, నరేష్ అగస్త్య మూవీ కలి ట్రైలర్

శర్వానంద్, సాక్షి వైద్య చిత్రం కేరళ షూటింగ్ షెడ్యూల్ పూర్తి

జానీ మాస్టర్‌కు మరో షాక్- నాలుగు రోజుల పాటు పోలీస్ కస్టడీ

భారతదేశం నుండి రెండు ప్రపంచ చిహ్నాలు మోదీ, దేవీ శ్రీప్రసాద్ అంటూ ట్వీట్

ధనుష్‌ సినిమాలో అర్జున్ రెడ్డి హీరోయిన్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ 3-5 కప్పుల కాఫీ తీసుకుంటే.. అంత మేలు జరుగుతుందా?

బత్తాయి రసంలో దాగున్న ఆరోగ్య రహస్యాలు ఏంటి?

4 సంవత్సరాల బాలుడికి ప్రాణాలను రక్షించే కాలేయ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం

తేనెతో డైరెక్ట్ ప్యాక్ వద్దు.. అలోవెరా జెల్, రోజ్ వాటర్‌తోనే?

ప్రపంచ హృదయ దినోత్సవం: బాదంపప్పులతో మీ హృదయాన్ని ఆరోగ్యంగా, సంతోషంగా ఉంచండి

తర్వాతి కథనం
Show comments