Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొకే ఇవ్వలేదనీ అలిగి వెళ్లిపోయిన టీడీపీ ఎంపీ వేమిరెడ్డి

ఠాగూర్
సోమవారం, 4 నవంబరు 2024 (10:44 IST)
టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కోపం వచ్చింది. అందరితో పాటు తనకు బొకే ఇవ్వకపోవడంతో ఆయన అవమానంగా ఫీలయ్యారు. దీంతో వేదికపై నుంచి లేచి అలిగి వెళ్లిపోయారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా అభివృద్ధి మండలి సమావేశంలో జరిగింది. ఆదివారం జిల్లా కేంద్రంలో ఈ మండలి సమావేశం జరిగింది. నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి జిల్లాకు చెందిన మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పి.నారాయణ కూడా హాజరయ్యారు.
 
అధికారులు ప్రజాప్రతినిధులను ఆహ్వానిస్తూ అందరికీ బొకేలు అందించారు. నెల్లూరు రూరల్ ఆర్డీవో ప్రత్యూష ప్రజాప్రతినిధుల పేర్లను పిలుస్తున్నారు. అయితే వేదికపై ఉన్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తనకు బొకే ఇవ్వకపోవడం పట్ల అవమానంగా భావించారు. ఆగ్రహంతో వెంటనే వేదిక దిగారు. మంత్రులు ఆయనకు సర్దిచెప్పేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 
 
తనకు అవమానం జరిగిన చోట ఉండలేనని చెబుతూ, వేమిరెడ్డి తన అనుచరులతో కలిసి జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. వేమిరెడ్డితో పాటే ఆయన అర్థాంగి, కోవూరు టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కూడా అక్కడి నుంచి నిష్క్రమించారు. 
 
కాగా, మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఈ ఘటన నేపథ్యంలో, అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోసారి ఇలా జరగకుండా చూసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు, ఇతర అధికారులకు స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

తర్వాతి కథనం
Show comments