Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతీయత ఉట్టిపడేలా రాజధాని అమరావతి డిజైన్లు...

లండన్‌లో నార్మన్‌ ఫోస్టర్‌ ఆర్కిటెక్ట్ కంపెనీ నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను రూపొందించింది. వీటిని లండన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన వెంట ఉన్న మ

Webdunia
బుధవారం, 25 అక్టోబరు 2017 (10:44 IST)
లండన్‌లో నార్మన్‌ ఫోస్టర్‌ ఆర్కిటెక్ట్ కంపెనీ నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను రూపొందించింది. వీటిని లండన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన వెంట ఉన్న మంత్రులు, దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళి పరిశీలించారు.
 
తన తొమ్మిది రోజుల విదేశీ పర్యటనలో భాగంగా దుబాయ్‌ నుంచి మంగళవారం లండన్‌ చేరుకున్న సీఎం చంద్రబాబు.. సినీ దర్శకుడు రాజమౌళితో కలసి ఫోస్టర్‌ బృందాన్ని కలుసుకున్నారు. రాత్రి బాగా పొద్దుపోయేవరకూ ప్రత్యేకంగా చర్చలు జరిపారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి లండన్‌కు చెందిన నార్మన్‌ పోస్టర్‌ సంస్థ ఇప్పటివరకు ఐదారుసార్లు డిజైన్లు రూపొందించినా అవి సీఎంను ఆకట్టుకోలేకపోవడం తెలిసిందే.
 
మరోసారి రూపొందించిన డిజైన్లపై నార్మన్‌ పోస్టర్‌ సంస్థ అధినేత లార్డ్‌ ఫోస్టర్‌తో నేరుగా చంద్రబాబు, రాజమౌళి సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా డిజైన్లను వారు స్వయంగా పరిశీలించారు.


ఈ డిజైన్లు భారతీయత ఉట్టిపడేలా, ప్రజల ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింభించేలా నవ్యాంధ్ర శాసనసభ, హైకోర్టు భవనాల ఆకారాలను తయారు చేశారు. ఒక్కో భవంతికి రెండు ఆకారాలను చంద్రబాబు, రాజమౌళి, యనమల తదితరులకు ఆ కంపెనీ ప్రతినిధులు చూపించారు.

నమూనా ఆకృతులను, ఆపై వీడియో చిత్రాలను వీరు తిలకించారు. ఈ భవంతుల ప్రత్యేకతలను వివరిస్తూ, నాలుగు కిలోమీటర్ల వరకూ ఇవి కనిపిస్తాయని క్రిస్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments