Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కొత్త డిజైన్లను తయారు చేసిన నార్మన్ పోస్టర్.. చంద్రబాబు కోసం వెయిటింగ్

నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో నిర్మించే ప్రభుత్వ భవనాల ఆకృతుల కసరత్తు వేగవంతమైంది. డిజైన్ల రూపకల్పన, ఖరారులో ఆలస్యం కావడంతో రాజధాని నిర్మాణంలో జాప్యం జరుగుతోందని భావిస్తున్న ప్రభుత్వం...

కొత్త డిజైన్లను తయారు చేసిన నార్మన్ పోస్టర్.. చంద్రబాబు కోసం వెయిటింగ్
, శుక్రవారం, 20 అక్టోబరు 2017 (11:41 IST)
నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో నిర్మించే ప్రభుత్వ భవనాల ఆకృతుల కసరత్తు వేగవంతమైంది. డిజైన్ల రూపకల్పన, ఖరారులో ఆలస్యం కావడంతో రాజధాని నిర్మాణంలో జాప్యం జరుగుతోందని భావిస్తున్న ప్రభుత్వం... వీలైనంత త్వరగా అమరావతి ఆకృతులను ఖరారు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ సలహా మేరకు ఈనెల 11న లండన్‌ వెళ్లిన టాలీవుడ్‌ దర్శకుడు రాజమౌళి.... నార్మన్‌ పోస్టర్‌ బృందంతో భేటీ అయ్యారు. 
 
ఇద్దరూ కలిసి పలురకాల నమూనా ఆకృతులను రూపొందించారు. గతంలో కంటే భిన్నంగా ఉండే విధంగా ఏడు రకాల ఆకృతులను తయారు చేశారు. ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించేందుకు వీటిని సీఆర్‌డీఏ వెబ్‌సైట్‌లో ఉంచారు. ఎక్కువ మంది ప్రజలు బాగుందని సూచించిన డిజైన్‌కు ప్రభుత్వం కూడా ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
 
మరోవైపు... ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలో ఉన్నారు. అమెరికాలో ఉన్న ఆయన.. అక్కడ నుంచి యూఏఈ వెళ్లి, అటునుంచి ఈ నెల 24న లండన్‌ చేరుకుంటారు. 25న రాజధాని ఆకృతులు రూపొందిస్తున్న నార్మన్‌ పోస్టర్‌ బృందంతో భేటీ అవుతారు. అసెంబ్లీ కోసం రూపొందించిన ఏడు డిజైన్లపై చర్చించి, ఒకదానిని ఖరారు చేస్తారు. ఈ విషయంలో ప్రజల అభిప్రాయాన్ని కూడా ముఖ్యమంత్రి పరిగణలోకి తీసుకుంటారు. లండన్‌ నుంచి చంద్రబాబు తుది డిజైన్‌తో తిరిగివచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతున్న కిమ్.. మాయమైతే అడగొద్దు: సీఐఏ