తిరుమలలో ఇక అలా దర్శనాలు ఉండవు: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

Webdunia
శనివారం, 2 మే 2020 (15:17 IST)
లాక్‌డౌన్ నేపథ్యంలో సుమారు 40 రోజులుగా తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని నిలిపేసిన విషయంపై ఆ దేవస్థాన చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు.

తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తరువాత ఆయా ప్రభుత్వాల సూచన మేరకు మళ్లీ స్వామివారి దర్శనాన్ని కల్పిస్తామని చెప్పారు. అయితే, గతంలోలా వేలు, లక్షల మందికి దర్శనాలు ఉండవని సుబ్బారెడ్డి తెలిపారు.

కొంతకాలం వరకు భౌతిక దూరాన్ని పాటించాల్సిన అవసరం ఉందని వివరించారు. క్యూలైన్లలో పలు మార్పులు ఉంటాయని చెప్పారు. ఒక్కో భక్తుడు కనీసం ఒక మీటర్ భౌతి దూరాన్ని పాటించేలా చూస్తామని వివరించారు.

లాక్‌డౌన్‌ ఎత్తేశాక ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా భక్తులు స్వామివారి దర్శనం చేసుకునేందుకు వీలు కల్పిస్తామని అన్నారు. మాస్కులు, శానిటైజర్లు వంటి సదుపాయాలు తిరుమలలోనూ ఏర్పాటు చేయాల్సి ఉంటుందని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Predator: Badlands: అన్ని జోన్లతో కలిపిన ప్రెడేటర్: బ్యాడ్‌లాండ్స్ సిద్ధమైంది

Raviteja: అందుకే మాస్ జాతర చిత్రీకరణ కాస్త ఆలస్యమైంది : దర్శకుడు భాను భోగవరపు

Bunny Vas: ఖమ్మం, వరంగల్ మధ్య జరిగే రియల్ కథతో రాజు వెడ్స్ రాంబాయి : వేణు ఊడుగుల

మెగాస్టార్ చిత్రంలో అవకాశం వచ్చిందా? మాళవికా మోహనన్

Janviswaroop: మహేష్ బాబు మేనకోడలు జాన్విస్వరూప్ నటిగా ఎంట్రీ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments