Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుమల భక్తులకు టైంస్లాట్‌ టోకెన్లు

Advertiesment
TimeSlot
, ఆదివారం, 15 మార్చి 2020 (10:57 IST)
తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు 17వ తేదీ మంగళవారం నుంచి టైంస్లాట్‌ టోకెన్లు జారీ చేయడం ద్వారా యాత్రికులను నేరుగా శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నట్లు టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. తిరుమలలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు టీటీడీ తీసుకున్న నిర్ణయాలను వివరించారు.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌– 1, 2 లలో వేచి ఉండకుండా టైంస్లాట్‌ టోకెన్లు పొందిన భక్తులను నేరుగా శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నట్లు వివరించారు. భక్తులు కంపార్ట్‌ మెంట్లలో వేచి ఉంటే కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం తిరుమల, తిరుపతిలలో టైమ్‌ స్లాట్లు టోకెన్లు ఇవ్వడానికి కౌంటర్లు అందుబాటులోనికి తెస్తామన్నారు. ఇంకా..
 
- భక్తులు వేచి ఉండే సమయాన్ని తగ్గించేందుకు విశేష పూజ, సహస్ర కలశాభిషేకం, వసంతోత్సవం సేవలు రద్దు. 
- ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏప్రిల్‌ 7వ తేదీన నిర్వహించవలసిన శ్రీ సీతా రాముల కల్యాణాన్ని ఆలయం వెలుపల రద్దు చేసి గతంలో వలే ఆలయం లోపల నిర్వహణ. 
- ఏప్రిల్‌ 5వ తేదీన ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఏర్పాటు చేసిన భూమిపూజ రద్దు.

- ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండడానికి స్వామివారి ఆశీస్సుల కోసం శ్రీ శ్రీనివాస శాంత్యోత్సవ సహిత ధన్వంతరి మహాయాగం మార్చి 19 నుంచి మూడు రోజుల పాటు నిర్వ హిస్తాం. విశాఖ శ్రీ శారదా పీఠా ధిపతి శ్రీ స్వరూపానందేంద్ర, మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠాధిపతి శ్రీ సుబుదేంద్రతీర్థ స్వామివార్ల ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది.  
-  అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాలతోపాటు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్, కల్యాణ కట్ట, అన్నప్రసాద భవనం తదితర ప్రాంతాల్లో థర్మల్‌ స్క్రీనింగ్‌.

-  భక్తులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రతి 2 గంటలకోసారి పరిశుభ్రత చర్యలు.
- యాత్రికులు 0877–2263447 నంబ రుకు ఫోన్‌ చేసి కరోనా వ్యాప్తి నివారణ చర్యలను తెలుసుకోవచ్చు.
- యాత్రికులకు కోవిడ్‌  లక్షణాలను గుర్తిస్తే నేరుగా రుయాలోని ఐసోలేషన్‌ వార్డుకు పంపుతాం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీ దుప్పట్లు మీరే తెచ్చుకోండి.. యోగాతో కరోనా దూరం